వైసీపీ ఇంచార్జ్ కుమారుడు ఆత్మ‌హ‌త్య‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-15 15:01:33

వైసీపీ ఇంచార్జ్ కుమారుడు ఆత్మ‌హ‌త్య‌

క‌ర్నూలుజిల్లా బ‌న‌గాన‌పల్లె  వైసీపీ ఇంచార్జ్ కాట‌సాని రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జున రెడ్డి 28 ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు..ఆయన తండ్రి వైసీపీ త‌ర‌పున  ఇంచార్జ్ గా కొన‌సాగుతున్నారు.. క‌ర్నూలు జిల్లాలో ఇప్ప‌టికే ఈ ఫ్యామిలీకి మంచిపేరు ఉంది రాజ‌కీయంగా..
 
కుమారుడు ఇలా చేసుకోవ‌డంతో ఆ కుటుంబం తీవ్ర విచారంలో ఉంది.. శుక్రవారం తన నివాసంలో నాగార్జునరెడ్డి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప‌లు స‌మ‌స్య‌ల వ‌ల్ల ఆయ‌న ఆత్మ‌హత్య చేసుకున్నారు అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.