దూసుకెళ్తున్న వైసీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-19 16:19:40

దూసుకెళ్తున్న వైసీపీ

టీడీపీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటుంది..2014 సార్వత్రిక ఎన్నికలలో కూడా టీడీపీ విజయానికి ఈ జిల్లా కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.. 14 నియోజగవర్గాలు ఉన్న అనంతపురం జిల్లాలో 2014 ఎన్నికలలో టీడీపీ 12 సీట్లు గెలుచుకొని జిల్లాపై తనకు ఉన్న పట్టును మరోసారి నిరూపించుకుంది..
 
వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో  బీట‌లు వాలే అవ‌కాశం ఉంద‌ని అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన ఓ ర‌హ‌స్య స‌ర్వేలో బ‌య‌ట ప‌డింది.. దీనికి ప్రధాన కారణం టీడీపీలో జరుగుతున్న అంతర్గత పోరు అయితే, టీడీపీ ప్రభుత్వం చేసిన మోసాలు కూడా ప్రజలకు తెలియడంతో వ్యతిరేఖత ఎక్కువగా ఉంది..దీనికి తోడు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రతో అనంతపురం జిల్లా ప్రజలను తనవైపుకు తిప్పుకున్నారు..ఈ జిల్లాలో జగన్ పాదయత్రకి వచ్చిన జనాన్ని చూసి వచ్చే ఎన్నికలలో టీడీపీ కోటకి బీటలు ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు...
 
ఇది ఇలా ఉంటే అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజక‌గవర్గంలో వైసీపీ దూసుకువెళ్తుంది..అక్కడ టీడీపీకి బలమైన నేతగా పల్లె రఘునాథ రెడ్డి. 2014 ఎన్నికలలో పవన్, బీజేపీతో క‌లిసి, 600 హామీలు ఇచ్చి టీడీపీ విజయం సాధించింది.  వైసీపీకి నియోజకవర్గ ప్రజల మద్దతు ఉన్నపటికీ, నడిపించే నాయకుడు లేకపోవడంతో పార్టీ ఇబ్బందులకు గురైంది.కానీ పార్టీని బలోపేతం చేయడానికి గతంలో హిందూపురం ఎంపీ స్థానానికి పోటీ చేసిన  దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని పుట్టపర్తి ఇంచార్జిగా నియమించింది వైసీపీ.
 
ఆర్థికంగా, సామాజికంగా బలమైన శ్రీధర్ రెడ్డి రాకతో పుట్టపర్తి వైసీపీ కార్యకర్తలకు పునరుతేజం కలిగి, శ్రీధర్ రెడ్డి అండతో గడప గడపకి వైసీపీని తీసుకువెళ్తున్నారు...శ్రీధర్ రెడ్డి కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ, అధికారంలో లేకపోయినప్పటికీ అవకాశం ఉన్న చోట్లా తన సొంత డబ్బుల్తో పరిష్కార‌ మార్గాలు చూపుతూ ముందుకు వెళ్తున్నారు...ఎన్నికల వరకు ఇలాగే ప్రజలతో మమేకం అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం అంటున్నారు మేధావులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.