బాబు గద్దె దిగడం ఖాయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-28 15:06:18

బాబు గద్దె దిగడం ఖాయం

బెంగుళూరులో జరిగిన వైసీపీ కుటుంబం ఆత్మీయ సమ్మేళానికి వేల సంఖ్యలో యువత హాజరై, పార్టీ మీద, జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని మరో సారి చాటుకున్నారు...ఈ సమావేశానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తిప్పా రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి, తంబళ్లపల్లి వైసీపీ ఇంచార్జి ద్వారకానాథ్ రెడ్డి ముఖ్య అతిథిలుగా వచ్చారు.
 
ఈ సందర్భంగా కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు నేతలు...
ఎంపీ మిథున్ రెడ్డి :
రాష్ట్రం కోసం, రాష్ట భవిష్యత్ కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.. పాదయత్రలో కాళ్ళకు గాయాలైనా కూడా లెక్కచేయకుండా ప్రజా సమస్య లు తెలుసుకోడానికి పాదయత్ర చేస్తున్న నాయకుడు జగన్. రాక్షస పాలనను ప్రారదోలి రాజన్న పాలనను ప్రజలకు అందించడానికి జగన్ నిరంతరం కష్టపడుతున్నారని అన్నారు మిథున్ రెడ్డి. మీ పోరాటం చూస్తుంటే ఇప్పుడే చంద్రబాబును గద్దె దించేటట్టు ఉన్నారని అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆన్నారు అయన.
 
ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి : 
పక్క రాష్ట్రంలో మన పార్టీ కోసం ఇంత మంది యువత ఈ సమావేశానికి రావటం చాల ఆనందంగా ఉంది... జగన్ పైన మీరు చూపిస్తున్న అభిమానం మరువలేనిదని అన్నారు...ప్రతి ఒక్కరు కష్ట‌పడి జగన్ ని ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.
 
ఎమ్మెల్యే తిప్పా రెడ్డి : 
ఎక్కడ ఉన్నా పార్టీ మీద అభిమానంతో రాష్ట్రంలో జరుగుతున్న‌ ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న మీకు నా ధన్యవాదాలు...
 
తంబళ్లపల్లి ఇంచార్జి ద్వారకానాధ్ రెడ్డి : 
మన కార్యకర్తలను, అభిమానులను దైర్యంగా ఎదుర్కోలేక చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా పార్టీతో పాటు, ప్రతి నాయకుడు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు...
 
ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు : 
2014 ఎన్నికల్లో గెలుస్తామని ఎంతో ధీమాతో ఉన్నాం, కానీ 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాం...ఈసారి ఆ అవకాశం ఇవ్వకూడదు, మనం గెలిచేశాం అనే భావన నుండి బయటకు వచ్చి, గెలిచే వరకు పోరాడి జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.