చంద్రబాబుకు నెంబ‌ర్ వ‌న్ బినామీ ఆయ‌నే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-10-15 16:33:20

చంద్రబాబుకు నెంబ‌ర్ వ‌న్ బినామీ ఆయ‌నే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకి నెంబ‌ర్ వ‌న్ బినామీగా ఎవ‌రైనా ఉన్నారు అంటే ఆది సాక్షాత్తు ఎంపీ సీఎం ర‌మేష్ నాయుడు మాత్ర‌మే అని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి రాంబాబు అన్నారు. 
 
ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, 2014 పూర్వం ర‌మేష్ కి చెందిన‌ రిత్విక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టులు ఎన్ని వ‌చ్చాయో అలాగే టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక రిత్విక్ కంపెనీకి ఎన్నిక కాంట్రాక్టులు వ‌చ్చాయో వాట‌న్నింటిని బ‌య‌ట పెట్టాల‌ని అంబ‌టి డిమాండ్ చేశారు.  
 
బాబు బినామీగా ఉన్న ర‌మేష్ కి, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శించే అర్హ‌త లేద‌ని హెచ్చ‌రించారు. కొద్దికాలంగా ప‌లువురు వ్యాపార‌స్తుల ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తే టీడీపీ నాయ‌కులకు భ‌యం ఎందుకుని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
అయితే ఈ దాడుల‌ను ప‌చ్చ నాయ‌కులు అదునుగా తీసుకుని ఐటీ దాడులు ప్రేరేపిత దాడులు అని చిత్రీక ర‌రిస్తున్నాయ‌ని అంబ‌టి మండిప‌డ్డారు. సుమారు నాలుగు సంవ‌త్సారాలు బీజేపీతో అంట‌గాగిన మీరు ఇప్పుడు అదే పార్టీని విమ‌ర్శించ‌డం హ‌స్యాస్ప‌దంగా ఉంద‌ని అన్నారు. టీడీపీ నాయ‌కులు చేస్తున్న అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన బుద్ది చెబుతార‌ని ఆయ&zw