చంద్ర‌బాబుపై వైసీపీ నేత ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-05 18:31:24

చంద్ర‌బాబుపై వైసీపీ నేత ఫైర్

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌ విష‌యంలో ఏపీకి అన్ని స‌మ‌కుర్చామ‌ని నిన్నకేంద్రం కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింద‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్  పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, కేంద్రం విడుద‌ల చేసిన కౌంట‌ర్ అఫిడ‌విట్ పై ఏపీ ముఖ్య‌మంత్రిచంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం గంద‌రగోళం చేస్తున్నార‌ని, ఆయ‌న‌కు అందుబాటులో ఉన్న మంత్రుల‌ను పిలిపించుకుని ఈ విష‌యం పై చ‌ర్చిస్తున్నార‌ని మండిప‌డ్డారు.
 
ప్ర‌త్యేక హోదా కేటాయించ‌కుండా కేంద్రం అన్యాయం చేసింద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే ఈ విష‌యాల‌న్ని చంద్ర‌బాబు ఈరోజే తెలిసిన‌ట్లు, ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా కేంద్రం ఈ రోజే తిర‌స్క‌రించిన‌ట్లు త‌న‌కు ఏమీ తెలియ‌ద‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంబ‌టి మండిప‌డ్డారు. ప్ర‌త్యేక హోదా కేంద్రం కేటాయించ‌కుండా పోవ‌డానికి చంద్ర‌బాబునాయుడు పాత్ర‌లేదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
విభ‌జ‌న హామీల‌ విష‌యంలో బీజేపీ ఏపీ ప్ర‌జ‌ల‌ను వెన్నుపోటు పొడిస్తే, ద‌గ్గ‌రుండి వెన్నుపోటు పొడిపించింది చంద్ర‌బాబు కాదా అని ప్ర‌శ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ప్ర‌త్యేకహోదా మా హ‌క్కు అని కేంద్రంపై నినాదాలు చేస్తే  త‌మ నాయ‌కులను టీడీపీ నాయ‌కులు అవ‌హేళ‌న చేశార‌ని ఆరోపించారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.