టీడీపీ భారీ స్కెచ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-09 03:45:12

టీడీపీ భారీ స్కెచ్

బాధ్య‌తాయుత‌మైన శాస‌న స‌భ స్పీక‌ర్ స్ధానంలో ఉన్న స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కోడెల శివ‌ప్ర‌సాద్, ఎన్నిక‌ల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస రావుతో క‌లిసి కుమ్మ‌క్కయ్యార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబు ఆరోపించారు. 
 
వీరిద్ద‌రూ క‌లిసి సుమారు ప‌దిహేనువేల  ఓట్లు తీయించార‌ని, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్ల‌ను గ‌ల్లంతు చేస్తున్నారంటూ  ఎన్నిక‌ల ముఖ్య అధికారికి ఫిర్యాదు  చేశారు అంబ‌టి రాంబాబు. చివ‌ర‌కు త‌న ఓటు, త‌న కుటుంబ‌స‌భ్యుల ఓట్లు కూడా తీయించార‌నే ఆయ‌న మ‌రోసారి గుర్తు చేశారు. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఎలాగైనా గెల‌వాల‌న్న ఉద్దేశంతోనే కోడెల ఇలాంటి అక్ర‌మాల‌కు  పాల్ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు. స్పీక‌ర్ కుమారుడు చేస్తున్న అరాచ‌కాల‌కు, అక్ర‌మాల‌కు అంతం లేకుండా ఉంద‌ని, ఓట్లు గ‌ల్లంతుపై తాము పోరాటం చేస్తామ‌ని అంబ‌టి  తెలిపారు.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.