బాబు ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్టిన వైసీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp
Updated:  2018-08-01 05:22:52

బాబు ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్టిన వైసీపీ

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లో బీసీల‌కు అన్యాయం జ‌రుగ‌కుండా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని చెప్పి అధికారంలోకి వ‌చ్చిన‌ చంద్ర‌బాబు నాయుడు కాపుల‌ను నిలువునా ముంచిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కుతుంద‌ని వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ధ్వ‌జ‌మెత్తారు.
 
ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశ‌లో ఆయ‌న మాట్లాడుతూ, చంద్ర‌బాబు కాపుల‌ను బీసీల్లో చేర్చుతామ‌ని హామీ ఇవ్వ‌డం వ‌ల్లే ముఖ్య‌మంత్రి అయ్యార‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై చిత్త‌ శుద్దిలేద‌నని ఒకవేళ‌ చిత్తశుద్ది ఉంటే ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే రిజ‌ర్వేష‌న్ల ప్రక్రియ‌ను ప్రారంభించే వారని అంబ‌టి మండిప‌డ్డారు. 
 
ఎప్పుడు అయితే మాజీ ఎంపీ ముద్ర‌గ‌డ ప‌ధ్మ‌నాభం కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా ఉద్య‌మాలు చేశారో అప్పుడు కాపుల‌పై స్పందించార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. అప్ప‌టిక‌ప్పుడు జ‌డ్జీని తీసుకువ‌చ్చి ఆయ‌న చేత చంద్ర‌బాబు నాయుడు మంజునాథ్ క‌మీష‌న్ వేయించార‌ని ఆయ‌న‌తో పాటు న‌లుగురు స‌భ్యులు క‌మీష‌న్ వేశార‌ని అంబ‌టి తెలిపారు. అయితే ఈ న‌లుగురు స‌భ్