ఆ ఘ‌న‌త వైఎస్ దే వైసీపీ నేత‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys rajasekhar reddy and ycp
Updated:  2018-09-01 06:09:55

ఆ ఘ‌న‌త వైఎస్ దే వైసీపీ నేత‌

రేపు మాజీ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తొమ్మిద‌వ వ‌ర్ధంతి క‌నుక ఈ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, సంక్షేమ ప‌థ‌కాల‌కు వైఎస్ రూప‌క‌ర్త అని ఆయ‌న అన్నారు.
 
ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను ద‌గ్గ‌రుండి చూసిన ఏకైక‌ రాజ‌కీయ నాయ‌కుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అని అంబ‌టి స్ప‌ష్టం చేశారు. ముస్లింల‌ను వైఎస్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నార‌ని, ఈ విష‌యాన్ని ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎవ‌రిని అడిగినా చెబుతార‌ని ఆయ‌న అన్నారు. వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు పోల‌వంరం ప్రాజెక్టు ప‌నుల కోసం అన్ని విధాల అనుమ‌తుల‌ను తీసుకువ‌చ్చిన ఘ‌న‌త ఆయ‌న‌కు మాత్ర‌మే ద‌క్కుతుంద‌ని అంబ‌టి స్ప‌ష్టం చేశారు. 
 
అయితే ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ప్ర‌జ‌ల‌కు ఏది కావాల‌న్నా కూడా ఫ్ల‌కార్డులు ప‌ట్టుకుని నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసే వ‌ర‌కు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డంలేద‌ని అంబ‌టి ఆరోపించారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పొందుప‌రిచిన హామీల‌ను ముస్లిం సోద‌రులు సామ‌ర‌స్యంగా స‌భ‌లో డిమాండ్ చేస్తే వారిపై అక్ర‌మంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేసులు పెట్టార‌ని అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.