జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌నిషా ప‌శువా వైసీపీ నేత ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-04 18:48:41

జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌నిషా ప‌శువా వైసీపీ నేత ఫైర్

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత తెలంగాణ‌తో పాటు ఏపీ కూడా బాగుప‌డుతుంద‌నే ఉద్దేశ్యంతో విభ‌జ‌న చ‌ట్టంలో ప్ర‌త్యేక హోదా, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌, విశాఖ రైల్వేజోన్ ల‌ను పొందుప‌రచాల‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్రంతో నాలుగు సంవ‌త్స‌రాలు మిత్ర‌ప‌క్షంలో ఉండి రాష్ట్రానికి ఏం సాధించార‌ని బొత్స ప్ర‌శ్నించారు. 
 
ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ నాయ‌కులు రాజ‌కీయ ల‌బ్దికోసం దీక్ష‌ల‌పేరుతో దొంగ‌ దీక్ష‌లు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. గతంలో తాము ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్, దుగ‌రాజ‌ప‌ట్నం షీ పోర్టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష‌లు చేస్తే చంద్ర‌బాబు నాయుడు వైసీపీ నాయ‌కుల‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేయించార‌ని బొత్స విమ‌ర్శించారు.
 
అలాగే అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డిపై కూడా ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌జల‌చేత ఎన్నుకోబ‌డిన నాయ‌కుడు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారని, ఆయ‌నలాంటి వాళ్లు ఉండ‌టం వ‌ల్లే రాజ‌కీయ నాయ‌కుల‌కు ప్ర‌తి ఒక్క‌రిలో చుల‌క‌న ఏర్ప‌డింద‌ని మండిప‌డ్డారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇల్లు ఎంత దూర‌మో మీ ఇల్లు కూడా అంతే దూర‌మ‌ని స్ప‌ష్టం చేశారు. పార్ల‌మెంట్ సభ్యుడిగా ఉంటూ ఇత‌ర పార్టీ స‌భ్యుల‌ను వాడు వీడు అని ఏక వ‌చ‌నంతో ఎలా మాట్లాడుతున్నార‌ని అస‌లు జేసీ మ‌నిషేనా లేక ప‌శువా ఎందుకు అంత‌లా మాట్లాడుతున్నార‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. 
 
జేసీకి అంతగా చంద్ర‌బాబు నాయుడు మీద  ప్రేమ ఉంటే ఆయ‌న నీళ్లు త‌ల‌మీద చ‌ల్లుకోవాల‌ని కానీ త‌మ నాయ‌కుడిని ఎందుకు విమ‌ర్శిస్తున్నార‌ని మండిప‌డ్డారు. జేసీ చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నాయ‌కులంతా క్ష‌మాపణ‌ చెప్పాల‌ని బొత్స డిమాండ్ చేశారు. స‌భ్య‌త సంస్కారం లేకుండా టీడీపీ నాయ‌కులు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. టీడీపీ నాయ‌కులు అధికార బలంతో చేసిన అవినీతి చ‌రిత్ర అంతా త‌న ద‌గ్గ‌ర సాక్షాల‌తో స‌హా ఉంద‌ని స్పష్టం చేశారు బొత్స‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.