ఆయ‌న‌ను ఎందుకు అరెస్ట్ చేడంలేదు.. వైసీపీ సూటి ప్ర‌శ్న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysr congress party
Updated:  2018-10-30 12:43:15

ఆయ‌న‌ను ఎందుకు అరెస్ట్ చేడంలేదు.. వైసీపీ సూటి ప్ర‌శ్న‌

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌థ‌కాలు ప‌న్నుతూ వ‌చ్చార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి సుధాక‌ర్ బాబు ఆరోపించారు ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై కుట్ర‌పూరిత‌మైన రాజ‌కీయ ల‌క్ష్యంతో టీడీపీ నాయ‌కులు హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
చంద్ర‌బాబు నాయుడు పునాదులే వెన్నుపోట్ల‌ని గ‌తంలో మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావును చంపి ముఖ్య‌మంత్రి అయిన చరిత్ర చంద్ర‌బాబు నాయుడుద‌ని సుధాక‌ర్ బాబు ఎద్దేవా చేశారు. ఆయ‌న కేవ‌లం కుట్ర రాజ‌కీయాలు, దౌర్జ‌న్యాలు మాత్ర‌మే న‌మ్ముకున్నార‌ని అందులో భాగ‌మే ఆప‌రేష‌న్ గరుడ అని సుధార్ అనుమానం వ్య‌క్తం చేశారు.
 
2014 ఎన్నిల్లో సుమారు ఆరు వంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ఇంత‌వ‌ర‌కు ఒక్క హామీను కూడా అమ‌లు చేయ‌లేద‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు ఇటు అమ‌రావ‌తి రాజ‌ధాని క‌ట్ట‌లేక‌పోయారు, అటు పోల‌వ‌రం ప్రాజెక్ట్ ను పూర్తి చేయ‌లేక‌పోయార‌ని అన్నారు. అంతేకాదు తాను అధికారంలోకి వ‌స్తే ఇంటిక ఒక ఉద్యోగం ఇస్తామ‌ని చెప్పి ఇప్ప‌టివ‌ర‌కు ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌ని సుధాక‌ర్ బాబు ఆర