ధైర్యం ఉందా...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 03:55:34

ధైర్యం ఉందా...

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు, అభివృద్దికి క‌ట్టుబ‌డి నిరంత‌రం పోరాటం చేస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని మంత్రి గంటా విమ‌ర్శించ‌డాన్ని ఆ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ త‌ప్పుబ‌ట్టారు. టీడీపీ ప‌రిపాల‌న‌లో ఉన్న లోపాల‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేసి, నీతివంత‌మైన రాజ‌కీయాలు చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శించే స్థాయి నీకుగాని, మీ తెలుగుదేశం పార్టీకి గాని లేదు అని తెలియ‌జేశారు.
 
విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన  మీడియా స‌మావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ... ప‌ద‌వి కోసం పార్టీలు మారే మంత్రి గంటా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటి చేస్తాన‌ని ప్ర‌క‌టించే ద‌మ్ము ఉందా అని ప్ర‌శ్నించారు.  విశాఖ భూ కుంభకోణంలో గంటా మొద‌టి వ్య‌క్తి అని  సొంత పార్టీ మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పిన‌ట్లు గుర్తు చేశారు. హుద్‌హుద్‌ తుఫాను దెబ్బ‌కు ఉక్కిరిబిక్కిరి అయిన విశాఖ ప్ర‌జ‌ల‌ను క‌నీసం ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌ని నువ్వు, మా పార్టీని విమ‌ర్శించ‌డానికి సిగ్గుప‌డాల‌ని మండిప‌డ్డారు.
 
ఓటుకు నోటు కేసుకు భ‌య‌ప‌డి ప్ర‌త్యేక హోదాని కేంద్రానికి తాక‌ట్టు పెట్టిన మీరు, హోదా కోసం గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా పోరాటం చేస్తున్న వైసీపీని ఎద్దేవా చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు. రాష్ట్ర అభివృద్ది త‌లుపులు మూసిన టీడీపీ.... అవినీతి త‌లుపులు తెరిచింద‌ని గుడివాడ అమర్నాథ్‌ ధ్వ‌జ‌మెత్తారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.