ఈ హత్యాయ‌త్నం వెనుక టీడీపీ పాత్ర ఖ‌చ్చితంగా ఉంది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp and tdp
Updated:  2018-10-29 04:13:29

ఈ హత్యాయ‌త్నం వెనుక టీడీపీ పాత్ర ఖ‌చ్చితంగా ఉంది

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు వెన్నుపోటు రాజ‌కీయాలు చేయ‌డం పుట్టుక‌తో వ‌చ్చాయ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు ల‌క్ష్మీపార్వ‌త్రి ఆరోపించారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ నంద‌మూరి తార‌క‌రామారావు స్థాపించిన‌టువంటి తెలుగుదేశం పార్టీ సిద్దాంతాల‌ను తుంగ‌లో తొక్కి ఎన్టీఆర్ ను చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచాడ‌ని ల‌క్ష్మీపార్వ‌త్రి మండిప‌డ్డారు. 
 
హ‌త్య‌లు చేయ‌డం చంద్ర‌బాబుకు స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని ఆరోపించారు. మ‌నిషి జాతిలో హీన‌మైన రాజ‌కీయాలు చేయ‌డం ఒక్క చంద్ర‌బాబు నాయుడుకు మాత్ర‌మే ద‌క్కుతుంద‌ని ఆమె ఎద్దేవా చేశారు. 2014లో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు అవినీతి ప‌రిపాలన‌ మొత్తం ప్ర‌పంచానికి తెలుస‌ని వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీ ఖ‌చ్చితంగా ఓడిపోతుందని త‌న‌తో స‌ర్వేలు కూడా చెబుతున్నాయ‌ని ల‌క్ష్మీపార్వ‌తి అన్నారు. 
 
అంతేకాదు ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హత్యాయ‌త్న పాత్ర‌లో టీడీపీ నాయ‌కుల పాత్ర కూడా ఉంద‌ని ఆమె ఆరోపించారు. అయితే వారు చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చు కునేందుకు జ‌గ‌న్‌పై హ‌త్య‌య‌త్నానికి పాల్ప‌డిన వ్య‌క్తి వైసీపీ కార్య‌క‌ర్త అని ఫ్లెక్సీల‌ను త‌యారు చేయించారని ప్ర‌స్తుతం అవి ఫేక్ ఫ్లెక్సీలుగా తేలింద‌ని అన్నారు. ని