హిందూపురంలో బాలయ్యకు ఓట‌మి భ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mla balakrishna
Updated:  2018-08-25 05:14:34

హిందూపురంలో బాలయ్యకు ఓట‌మి భ‌యం

అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నార‌ని వైసీపీ హిందూపురం స‌మ‌న్వయ క‌ర్త న‌వీన్ నిశ్చ‌ల్ అన్నారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, 2019లో టీడీపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే భారీ ప్యాకేజిని ప్ర‌క‌టిస్తామ‌ని వైసీపీ నాయ‌కులకు ఎర వేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
ఇదే క్ర‌మంలో తాము ప‌లుమార్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా కూడా వారు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈమేర‌కు ఆయ‌న తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తుగా స‌ర్వేల‌ను చేస్తున్న 15 మందిని రెడ్ హ్యండ్ గా ప‌ట్టుకుని వారిని పోలీసులకు అప్ప‌గించారు. 2014 నుంచి హిందూపురంలో ప్ర‌జాస్వామ్యం ఖూని అయింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డ‌ వేసిన గొంగలి అక్క‌డే అన్న‌ట్లు హిందూపురంలో ఉన్న స‌మ‌స్య‌ల‌న్ని అలాగే ఉండిపోయాయ‌ని నిశ్చ‌ల్ ఆరోపించారు.
 
అయితే వాట‌న్నింటి ప్ర‌జలు దృష్టిలో ఉంచుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు త‌గిన బుద్ది చెప్పేంద‌కు రెడి అయ్యారు ఈ క్ర‌మంలో వారిని తిరిగి త‌మ వైపు తిప్పుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని నిశ్చ‌ల్ మండిప‌డ్డారు. టీడీపీ నాయ‌కులు స‌ర్వేల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల కీల‌క స‌మాచారాన్ని సేక‌రించ‌డం దారుణం అని నిశ్చ‌ల్ ఆరోపించారు.