జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా మ‌రో పాద‌య‌త్ర

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-09-25 12:35:05

జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా మ‌రో పాద‌య‌త్ర

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు 2017 న‌వంబ‌ర్ 6న ఇడుపుల‌పాయ‌లో ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పేరుతో పాద‌యాత్ర‌ మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంక‌ల్ప‌యాత్రలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజ‌య‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఆరు జిల్లాల‌ను, ఉత్తారాంధ్ర‌లోని విశాఖ జిల్లాను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో దిగ్విజయంగా కొన‌సాగుతుంది. 
 
జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో విజ‌య‌న‌గ‌రం జిల్లాలోకి అడుగు పెట్ట‌గానే 3000 వేల‌కిలో మీట‌ర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ పాద‌యాత్ర‌కు గుర్తుగా ఒక మొక్క‌ను నాటి పైలాన్ ఆవిష్క‌రించారు. ఇక ఈ పాద‌యాత్ర‌కు  సంఘీబావంగా వైసీపీ నాయ‌కులు నియోజ‌క‌వ‌ర్గంలో మూడురోజుల పాటు పాద‌యాత్ర చేస్తున్నామ‌ని మీడియాముందు తెలిపారు. ఈ రోజు ఉద‌యం 7 గంట‌ల‌కు మొద‌లైన ఈ పాద‌యాత్ర పూర్ణానందంపేట‌, పెజ్జోనిపేట‌, బాప్టిస్టుపాలెం మీదుగా ఖుద్దూస్ న‌గ‌ర్  కేద‌రేశ్వ‌ర‌పేట వ‌ర‌కు సాగ‌నుంది. 
 
తిరిగి రేపు పాత‌బ‌స్తి మ‌ల్లికార్చున పేట‌, పెద్ద‌మ్మ‌గుడి, సుబ్ర‌హ్మ‌ణ్యం స్వామిగుడి మెట్ల‌రోడ్డు శ్రీనివాస్ మ‌హ‌ల్ మీదుగా స‌య్య‌ద్ అప్ప‌ల‌స్వామి క‌ళాశాల వ‌రకు సాగ‌నుంచి ఆ త‌ర్వాత 27న పాత బ‌స్తీనుంచి కోమ‌ల్ వాలాస్ సెంట‌ర్,అప్ప‌ల స్వామి వీది, మీదుగా పంజా సెంట‌ర్ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నామ‌ని ఆ త‌ర్వాత ముగింపు స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నామ‌ని న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడు వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.