బాబును ఏకి పారేసిన పార్థ‌సార‌ధి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp leader pardha saradhi
Updated:  2018-06-19 05:12:28

బాబును ఏకి పారేసిన పార్థ‌సార‌ధి

ఏపీ ప్ర‌తిప‌క్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి మ‌రోసారి పార్టీ కార్యాలయంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాలుగు నెల‌ల నుంచి రాష్ట్రంలో పెడ‌బ‌బ్బులు పెడుతూ భ‌యాందోళ‌న‌కు గురి చెందుతున్నార‌ని పార్థ‌సార‌ధి విమ‌ర్శించారు.
 
నాలుగు సంవ‌త్స‌రాలుగా ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వ‌మే అన్యాయం చేసింద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం అన్యాయం చేయ‌లేద‌ని నిరూపించుకునేందుకు టీడీపీ నాయ‌కులు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని పార్థ‌సార‌ధి ఆరోపించారు.
 
ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి ర‌చంద్ర‌బాబు నాయుడు నీతిఅయోగ్  స‌మావేశంలో ప్ర‌ధాని మోడీని క‌డిగేస్తారు, నిల‌దీస్తార‌ని టీడీపీ నాయ‌కులతో పాటు వారి అనుకూల మీడియా కూడా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశార‌ని విమ‌ర్శించారు. అయితే ఆ స‌మావేశంలో ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేద‌ని అన్నారు. ఈ స‌మావేశంలో మాట్లాడితే కేంద్రం త‌న‌ను ఎక్క‌డ వీపు విమానం మోగిస్తారో అని చంద్ర‌బాబు భ‌య‌పడ్డార‌ని పార్థ‌సార‌ది విమ‌ర్శించారు. 
 
ఈ స‌మావేశం ముగిసిన త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడుకి మీడియాతో మాట్లాడే ద‌మ్ములేక, వారికి స‌మాధానం చెప్ప‌లేక పారిపోయి వ‌చ్చిన వ్య‌క్త‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కేంద్రం విష‌యంలో టీడీపీ నాయ‌కులు ఎందుకు మౌనంగా ఉన్నార‌ని, మోడీని ఎందుకు నిల‌దీయ‌డంలేదో వారు చెప్ప‌లేక పోతున్నార‌ని పార్థ‌సార‌ధి ప్ర‌శ్నించారు. ఇక ఈ స‌మావేశంలో చంద్ర‌బాబు నాయుడు మోడీతో మాట్లాడిన తీరు ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న చూస్తుంటే ఏపీ ప్ర‌జ‌లు త‌ల దించుకునే విధంగా చేశార‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.