ఉమా నీకు సిగ్గు ల‌జ్జా ఉండి మాట్లాడుతున్నావా ‍‍‍వైసీపీ నేత‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-07 15:40:07

ఉమా నీకు సిగ్గు ల‌జ్జా ఉండి మాట్లాడుతున్నావా ‍‍‍వైసీపీ నేత‌

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు స‌బ్జెక్ట్ లేక తేలుకుట్టిన దొంగ‌ల్లాగా, ఏ విష‌యం గురించి మాట్లాడాలో తెలియ‌క ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేసులు, 420 విష‌యాల‌ను లేవ‌నెత్తుతున్నార‌ని వైసీపీ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పార్థసార‌ధి మండిప‌డ్డారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ గతంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై కేసులు పెట్టినా కూడా త‌మ నాయ‌కుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్లి, 2014లో పోటీ చేసి 67 సీట్ల‌ను గెలిచార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
ఇది కేవ‌లం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలు క‌లిసి గతంలో జ‌గ‌న్ రాజ‌కీయంగా అణ‌చివెయ్యాల‌నే ఉద్దేశంతో వీరు అక్ర‌మంగా కేసులు పెట్టార‌ని పార్థ‌సార‌థి మండిప‌డ్డారు. అయితే  ఈ కేసుల‌న్ని త‌ప్ప‌ని చెప్పి తాము వ్రాత పూర్వ‌కంగా కోర్టుకు స‌మ‌ర్పించామ‌ని ఈ విష‌యాల‌ను టీడీపీ నాయ‌కులు అక్కడికి వెళ్లి తెలుసుకోవాల‌ని పార్థ‌సార‌థి అన్నారు. ఇంకొక్క సారి తెలుగుదేశం పార్టీ మంత్రులు జ‌గ‌న్ కేసుల‌పై విమ‌ర్శ‌లు చేస్తే ప్ర‌జ‌లంద‌రూ కూడా పేడ తీసి వారి ముఖం మీద కొట్టేందుకు సిద్ద‌మ‌య్యార‌ని పార్థసార‌థి స్ప‌ష్టం చేశారు. 
 
రాష్ట్రానికి సంబంధిచిన విష‌యాల‌పై టిడీపీ నాయ‌కుల‌కు స‌బ్జెక్ట్ ఉంటే త‌ప్ప‌కుండా అడ‌గండి దాని గురించి స‌మాధానం చెబుతామ‌ని ఆయ‌న అన్నారు. అయితే టీడీపీ నాయ‌కుల‌కు చేత‌కాక ఇలా అడ్డ‌దారిలో ఎదురు దాడి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, వారు ఎన్ని కుట్ర‌లు చేసినా తాము ఎదుర్కోవ‌డానికి సిద్దంగా ఉన్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 
అంతేకాదు పోల‌వ‌రం ప్రాజెక్ట్ విష‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించ‌కూడ‌ద‌ని మంత్రి దేవినేని ఉమా అంటున్నార‌ని అయితే ఉమాకు కొంచెం కూడా సిగ్గు, ల‌జ్జా లేకుండా మాట్లాడుతున్నార‌ని పార్థ‌సార‌థి మండిప‌డ్డారు. గతంలో మాజీ ముఖ్యంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి అలోచ‌న‌లు సిద్దాంతంగా తీసుకుని ఏర్ప‌డిన ఈ పోల‌వ‌రం ప్రాజెక్ట్ విష‌యంలో మాట్లాడే అర్హత‌  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
గతంలో పోల‌వ‌రం ప్రాజెక్ట్ పై అనేక మంది మాట్లాడార‌ని కానీ దానిని అమ‌లు చేసిన ఘ‌న‌త వైఎస్ కే ద‌క్కింద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఎక్కువ మాట్లాడితే టీడీపీ నాయ‌కులు, జ‌ల‌వ‌న‌రుల శాఖ‌ మంత్రి ఉమాకు మాట్లాడే అర్హ‌త లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇక ఇప్పుడు వారు చేసిన మోసాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు ఇష్టం వ‌చ్చిన‌ట్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విమ‌ర్శ‌లు చేస్తున్నారని ఆయన మండిప‌డ్డారు. అయితే ఇక నుంచి అయినా ఉమా నోరు అదుపులో పెట్టుకుని వాస్త‌వాల‌పై మాట్లాడాల‌ని పార్థ‌సారథి స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు మీకు ఇచ్చిన బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మంగా క్ర‌మంగా నిర్వహించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.