చంద్ర‌బాబుకు అదిరిపోయే పేరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-08-21 04:25:07

చంద్ర‌బాబుకు అదిరిపోయే పేరు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని ఆర్థిక వ‌న‌రులుగా మార్చుకుని విచ్చ‌ల‌విడిగా దోచుకుంటున్నార‌ని ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత పార్థ‌సార‌ధి మండిప‌డ్డారు.. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు త‌న స్వ‌లాభం కోసం రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టార‌ని, అప్పుల అప్పారువుగా మారి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నార‌ని పార్థ‌సార‌ధి మండిప‌డ్డారు.
 
ప్ర‌స్తుతం టీడీపీ స‌ర్కార్ క్యాన్సర్ రాష్ట్రానికి ప‌ట్టుకుంద‌ని దీంతో రాష్ట్రం అలాతా కుతం అవుతోంద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. అయితే దాని 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్లీన్ చేస్తార‌ని పార్థ‌సార‌ధి స్ప‌ష్టం చేశారు.
 
చంద్ర‌బాబు దోచుకున్న సొమ్మునే ఇన్వేస్ట‌ర్లు బాండ్ల‌ రూపంలో కొంటున్నార‌ని అయితే సీఆర్డీఏ బ‌లంగా ఉంటే ఎందుకు బాండ్లు ఇవ్వాల‌ని పార్థ‌సార‌ధి మండిప‌డ్డారు. రాష్ట్రంలో కురుస్తున్న చిన్నపాటి వ‌ర్షానికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నిర్మించిన రాజ‌ధాని స‌చివాల‌యంలోకి నీరు రావ‌డం విడ్డూరంగా ఉంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. మంత్రుల చాంబ‌ర్ లోకి ఎలా నీరు వ‌చ్చాయి , మంత్రులే ఏమైనా పైపుల‌ను లీక్ చేసి ఉంటార‌ని పార్థ‌సార‌ధి ఎద్దేవా చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.