నచ్చితే నంది నచ్చకపోతే పంది సంచ‌ల‌న కామెంట్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sai reddy
Updated:  2018-10-23 05:41:37

నచ్చితే నంది నచ్చకపోతే పంది సంచ‌ల‌న కామెంట్స్

ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి ఏపీ స‌ర్కార్ ను అలాగే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అక్ర‌మాల‌పై త‌మ‌దైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి టీడీపీ నాయ‌కుల‌పై వారికి వ‌త్తాసు ప‌లుకుతున్న మీడియాల‌పై దుమ్మెత్తిపోశారు విజ‌య‌సాయి రెడ్డి. ఈ మేర‌కు అయ‌న త‌న సోష‌ల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు.
 
ఆ రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీద దాడులు చేస్తే అది సీబీ...ఐ! ఇప్పుడు సీఎం రమేష్ నాయుడు పేరు బయటకు వచ్చేసరికి అది ఛీ…బీఐ అయిపోయింది అంటు మండిప‌డ్డారు విజ‌య‌సాయిరెడ్డి. తమకు నచ్చితే నంది... నచ్చకపోతే పంది. ఇదీ బాబును భుజాన మోస్తున్న ఎల్లో మీడియా వికారం. ఇదీ టీడీపీ అనుసరించే అధికార విధానం.

షేర్ :