అరచేతిలో వైకుంఠం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-12 12:54:00

అరచేతిలో వైకుంఠం

పోలవరం ప్రాజెక్టు ఈ ఏడాది ఖరీఫ్‌ నాటికే డ్యాం పూర్తిచేసి నీళ్లిస్తామని గతంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి,  ఇప్పుడు సోమవారానికి ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పునాది పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తయినట్లు పోలవరం ప్రాజెక్టు వద్ద భారీ పైలాన్‌ ఆవిష్కరణ, జన సమీకరణ చేసి ప్రజలను మభ్యపెడుతూ అరచేతిలో వైకుంఠం చూపుతున్న చంద్రబాబుపై వైస్సార్సీపీ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి మండిపడ్డారు 
 
పైలాన్‌ ఆవిష్కరణ సభకు రూ. 3.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు జలవనరుల శాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. పునాది పనులే పూర్తి చేయడానికి నాలుగేళ్ల సమయం పట్టిందంటే ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఎలా ఉందో అర్థమవుతుంది అని ఆమె అన్నారు . హెడ్‌వర్క్స్‌లో 45 డిజైన్లకు గాను ఇప్పటివరకు కేవలం 14 డిజైన్లను మాత్రమే కేంద్ర జలసంఘం ఆమోదించింది.మిగిలిన 31 డిజైన్లను రాష్ట్రప్రభుత్వం ఇప్పటికీ తయారు చేయలేకపోయింది.
 
పోలవరం ప్రాజెక్టును 2018 ఖరీఫ్‌ నాటికి పూర్తి చేస్తామని 2014 జూన్‌ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో చంద్రబాబు హామీ ఇచ్చారు అని,  విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఖర్చు భరించి, నిర్మించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ‘స్పెషల్‌ పర్సస్‌ వెహికల్‌’గా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ను ఏర్పాటు చేసింది  అని ఆమె వివరించారు 
 
 
నాలుగేళ్లలో 18.06 శాతం మాత్రమే పనులు జరిగాయని.. పోలవరం ప్రాజెక్టు పనులను 63 సార్లు వర్చువల్‌ రివ్యూలు.. 24 సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించడం ద్వారా చంద్రబాబు సమీక్షించారు. ఇప్పటివరకూ మొత్తం 54.73 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు జలవనరుల శాఖ రికార్డులే చెబుతున్నాయి. ఇందులో 39.67 శాతం పనులు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి అని ఆమె తెలిపారు. అంటే నాలుగేళ్లలో కేవలం 18.06 శాతం పనునులు మాత్రమే పూర్తయినట్లు స్పష్టమవుతోంది  అని ,  2018 ఖరీఫ్‌ వచ్చేసింది అని ఆమె సూచించారు 
 
ఇది ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక పని మాత్రమే. కానీ తెలుగుదేశం ప్రభుత్వం పునాది పనులను చేయడానికే నాలుగేళ్ల సమయం తీసుకుంది. ఇప్పుడు దీన్నే సోమవారం సీఎం చంద్రబాబునాయుడు జాతికి అంకితం ఇచ్చారని . ఎక్కడైనా, ఏ ప్రభుత్వమైనా ప్రాజెక్టులు పూర్తయిన తరువాత, ఆయకట్టుకు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేయడం సంప్రదాయం. కానీ సీఎం చంద్రబాబు మాత్రం పోలవరం ప్రాజెక్టు పునాది గోడను జాతికి అంకితం చేయడం చూస్తుంటే చంద్రబాబుకు తనపై తనకు అభద్రతా భావ మొదలు అయి ప్రజలను మభ్యపెడుతున్నారని అని అభిప్రాయపడ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.