ప‌ప్పు ముందు నువ్వు తెలుగునేర్చుకో రా..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and lokesh
Updated:  2018-10-29 01:38:58

ప‌ప్పు ముందు నువ్వు తెలుగునేర్చుకో రా..

ప్ర‌తిపనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై శ్రీనివాసరావు అనే వ్య‌క్తి క‌త్తితో హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ హ‌త్య‌ను ఇత‌ర రాష్ట్ర రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన హీరోలు కూడా తీవ్రంగా ఖండించారు. కానీ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మాత్రం ఈ దాడి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేయించుకుని ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర నుంచి సానుభూతి పొందాల‌ని చూశార‌ని కానీ అది తేట‌తెల్ల‌మైంద‌ని వ్యాఖ్య‌లు చేశారు.
 
ఇక ఇదే క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేశ్ కూడా జ‌గ‌న్ పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నంపై స్పందిస్తూ సోషల్ మీడియాల్ ట్వీట్ చేశారు. తండ్రిచితికి నిప్పు పెట్ట‌క‌ముందే ముఖ్య‌మంత్రి పీఠంపై క‌న్నేసిన వ్య‌క్తి ఇలాంటి క‌త్తి డ్రామా చెయ్య‌డంలో ఆశ్చ‌రం లేదు.. ఎన్ని కుయుక్తులు ప‌న్నినా ఆఖ‌రిగా ప్ర‌జ‌ల ముందు గెలిచేది నిజం మాత్ర‌మే అంటూ ట్వీట్ చేశారు. 
 
ఇక ఈ ట్వీట్ పై స్పందించిన వైసీపీ నాయ‌కురాలు శైల‌జా రెడ్డి, లోకేశ్ కు త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇస్తూ ట్వీట్ చేశారు. ఆశ్చ‌రం కాదురా పప్పు ఆశ్చర్యం అని రాయాలి .. పప్పు  నువ్వు ముందు తెలుగు నేర్చుకొని రా.. వార్డ్ మెంబర్ గా గెలవలేని నువ్వు జగనన్న గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది...? అంటూ శైల‌జా రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు,

షేర్ :

Comments

0 Comment