మొద‌లైన వైసీపీ స‌మ‌రం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-23 15:54:29

మొద‌లైన వైసీపీ స‌మ‌రం

నాలుగు సంవ‌త్స‌రాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను డిమాండ్ చేస్తూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.అయితే ఈ పోరాటంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అధికార బ‌లంతో వైసీపీ నాయ‌కుల‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేయించారు.
 
ఇక‌ ఇప్పుడు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయ‌నే ఉద్దేశ్యంతో క‌డ‌ప ఉక్కు రాయ‌ల‌సీమ హ‌క్కు అనే నినాదంతో దీక్ష‌లు చేస్తున్నార‌ని రాయ‌చోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. స్టీల్ ఫ్యాక్ట‌రీ కోసం తాము చిత్త శుద్దితో ప‌ని చేస్తున్నామ‌ని అన్నారు.  ప‌రిశ్ర‌మ‌కోసం తాము రాజీనామాలు చేయ‌డాని అయినా సిద్దంగా ఉన్నామ‌ని, అయితే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారా అని స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. 
 
అయితే తాజాగా పార్టీ అధిష్టానం మేర‌కు ఈ రోజు వైసీపీ నాయ‌కులు మ‌హా ధ‌ర్నాను చేప‌ట్టారు. ఈ ధ‌ర్నాను ఈ నెల 26 వ‌ర‌కూ క‌డ‌ప జిల్లాలో చేప‌డుతున్నామ‌ని వైసీపీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. దీంతో పాటు ఈ నెల 24 న బద్వేలులో మహా ధర్నా, రాజంపేటలో 25న మహాధర్నా, జమ్మలమడుగులో భారీ దీక్షలు చేపడుతామని రామ‌కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.