అయ్య‌న్న క‌నుస‌న్నల్లో గంజాయి అమ్మ‌కం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ayyanna pathrudu
Updated:  2018-08-21 11:33:28

అయ్య‌న్న క‌నుస‌న్నల్లో గంజాయి అమ్మ‌కం

అధికార తెలుగుదేశం పార్టీ మంత్రి అయ్యన్న పాత్రుడు క‌నుస‌న్నల్లోనే న‌ర్సీప‌ట్నంలో గంజాయి వ్యాపారం య‌థేచ్చిగ కొన‌సాగుతోంద‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న‌ర్సీప‌ట్నం అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్నాథ్ ఆరోపించారు.గంజాయి అమ్మ‌కాల్లో మంత్రి పాత్ర ఉంద‌ని తెలిసి అధికారులు కూడా చూసి చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
గంజాయి వ్య‌వ‌హారంలో మంత్రి అయ్య‌న్న పాత్రుడు డాన్ అని గ‌తంలో ఇదే విష‌యాన్ని స‌ద‌రు టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసురావే చెప్పార‌ని ఆయ‌న గుర్తు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనేక హామీల‌ను ప్ర‌క‌టించి ఎమ్మెల్యే అయి ఆ త‌ర్వాత మంత్రి అయిన అయ్య‌న్న పాత్రుడు ఒక్క హామీని కూడా అమ‌లు చేయ‌లేద‌ని అమ‌ర్నాథ్ ఆరోపించారు. 2019 ఎన్నిక‌లు త‌ర్వాత మంత్రి అయ్య‌న్న రాజకీయ స‌న్యాసం తీసుకోవాల్సిన అవ‌స‌రంలేద‌ని రానున్న రోజుల్లో ప్ర‌జ‌లే ఆయ‌న‌ను సాగ‌నంపుతార‌ని అమ‌ర్ నాథ్ ఎద్దేవా చేశారు. 
 
నాలుగు సంవ‌త్స‌రాలు టీడీపీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి త‌గిన బుద్ది చెబుతార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు అబ‌ద్ద‌పు మాట‌లు చెప్పే టీడీపీ నాయ‌కులకు త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శించే అర్హ‌త లేద‌ని అమ‌ర్నాథ్ హెచ్చ‌రించారు.