వైసీపీ అభ్య‌ర్ది నామినేష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-07 01:27:36

వైసీపీ అభ్య‌ర్ది నామినేష‌న్

వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్దిగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేశారు.. తాజాగా జ‌గ‌న్ తెలియ‌చేసిన‌ట్లు ఏడ‌వ తారీఖున మ‌న అభ్య‌ర్ది నామినేష‌న్ వేస్తారు అని తెలియ‌చేశారు అలాగే నేడు ఆయ‌న నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డం జ‌రిగింది.... అసెంబ్లీ సెక్రటరీకి మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు... ఆయ‌న వెంట ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఆయ‌న నామినేష‌న్ వేసిన త‌ర్వాత‌, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి తాను అభిమానిని అని, వైఎస్‌ఆర్‌ పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ కు ప్ర‌జాక‌ర్ష‌న మెండుగా ఉంది అని అన్నారు.
 
ఇక పార్టీలో వైయ‌స్ జ‌గ‌న్  త‌న‌కు ఎంతో విలువ  గౌర‌వం ఇచ్చేవార‌ని అన్నారు.. త‌న‌కు 40 ఏళ్లుగా వైయ‌స్ ఆర్ కుటుంబంతో  అనుబంధం ఉంది అని అన్నారు ... రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో వైయస్ ఆర్ సీపీ కచ్చితంగా గెలుస్తుంది అని అన్నారు.. ఏ పార్టీ వాళ్లు అయినా వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రను చూస్తే ఆయన ఎంత గొప్ప నాయకుడో తెలుస్తుంది అని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు..
 
దురదృష్టవశాత్తు వైఎస్‌ఆర్‌ చనిపోయారు. కానీ ఈ రాష్ట్రానికి మంచి నాయకుడిని అందించారు. ఎన్నికష్టాలు ఎదురైనా జగన్‌ ప్రజల కోసం ధృడంగా నిలబడ్డారు. 2019లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు అని అన్నారు వైసీపీ రాజ్య‌స‌భ అభ్యర్ది వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.