బ్రేకింగ్ వైసీపీ నేత‌లు అరెస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-08 17:34:40

బ్రేకింగ్ వైసీపీ నేత‌లు అరెస్ట్

రైతుల పొలాల‌కు సాగునీరు అందించాల‌ని ఇరిగేష‌న్ శాఖ అధికారికి విన‌తి ప‌త్రం అందించాల‌ని బ‌య‌ల్దేరిన వైసీపీ సీనియ‌ర్ నేత పార్థ‌సార‌థితో పాటు రైతుల‌ను కూడా పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు 100 మంది రైతుల‌తో క‌లిసి పార్థ‌సార‌థి, అలాగే జోగి ర‌మేష్ లు ఇంజ‌నీరింగ్ శాఖ అధికారికి విన‌తి ప‌త్రం ఇవ్వాల‌ని శాంతియుతంగా బ‌య‌ల్దేరారు. అయిన‌ప్ప‌టికీ పోలీసులు వారిని మార్గం మ‌ధ్య‌లోనే అరెస్ట్ చెయ్య‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంది. 
 
అరెస్ట్ అయిన త‌ర్వాత పార్థ‌సార‌థి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు రైతుల‌కు నీళ్లు ఇవ్వ‌కుండా మోసం చేస్తున్న త‌రుణంలో రైతులకు న్యాయం చెయ్యాల‌ని ఇంజ‌నీర్ శాఖ అధికారికి విన‌తి ప‌త్రం ఇవ్వ‌డానికి వెళ్తే త‌మ‌ను అరెస్ట్ చేస్తారా... అని ఆయ‌న ప్ర‌శ్నించారు. స‌ర్కార్ నిర్లక్ష్యం వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు కృష్ణా జిల్లాలో రైతులు స‌గం కూడా నాటు వెయ్య‌లేద‌ని పార్థ‌సార‌థి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  
 
మ‌చిలీ ప‌ట్నం, పెడ‌న, అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లో 10 శాతం కూడా రైతులు పంట‌లు వెయ్య‌లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే వీటిపై టీడీపీ నాయ‌కులు చ‌ర్చించ‌కుండా ఉండ‌టం దారుణం అని ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంద‌రు త‌మ‌కు సాగునీరు కావాల‌ని చెప్పి విన‌తి ప‌త్రాలు ఇచ్చార‌ని కానీ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చీమ కుట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌కున్నార‌ని పార్థసార‌థి ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.