ఆదినారాయ‌ణ రెడ్డి ద‌మ్ముంటే మాతో పెట్టుకో..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-05 15:39:40

ఆదినారాయ‌ణ రెడ్డి ద‌మ్ముంటే మాతో పెట్టుకో..

వైయ‌స్సార్ క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌కవ‌ర్గంలోని పెద్దదండ్లూరు గ్రామంలో మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి అనుచ‌రులు అధికారబ‌లంతో వైసీపీ కార్య‌క‌ర్తల‌పై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ దాడిపై వైసీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్ రెడ్డి స్పందించారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి అధికార మ‌దంతో ద‌ళిత ప్ర‌జ‌ల‌పై దాడి చేయిస్తున్నార‌ని మండిప‌డ్డారు. పేద‌వారిపై కాదు మీ బ‌లం.. ద‌మ్ముంటే త‌మ‌పై చూపించాల‌ని సుధీర్ రెడ్డి స‌వాల్ విసిరారు. పెద్దదండ్లూరు గ్రామంలో సంపత్ అనే వైసీపీ కార్య‌క‌ర్త తమ గ్రామానికి రావాలని పిలిస్తే ఎందుకు పిలిచావంటూ మంత్రి వర్గీయులు దళితుడైన సంపత్‌పై దాడి చేయడం దారుణం అన్నారు.  అయితే ఈ విష‌యంపై మంత్రి ఆది చర్చకు వచ్చినా ఇంకోదానికి వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎక్కడో కూర్చొని తమ కుటుంబ సభ్యులు, కుమారుడి చేత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
 
ప్ర‌జా స్వామ్యంలోఅంద‌రికి స‌మానమైన హ‌క్కులు ఉన్నాయి కాబ్ట‌టి అంద‌రు ప్ర‌జాస్వామ్యానికి లోబ‌డి ఉండాల‌ని ఆయ‌న సూచించారు. కాదు కూడ‌ద‌ని అధికార బ‌లంతో మీరు రంగంలోకి దిగితే తాము కూడా రంగంలోకి దిగుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు సుధీర్ రెడ్డి. అలాగే తమ కార్య‌క‌ర్త‌ల‌పై ఆది వ‌ర్గీయులు దాడి చేస్తే ప‌రామ‌ర్శించ‌డాని క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి వెళ్తే పోలీస్ అధికారులు ఆయ‌న‌ను అడ్డుకున్నార‌ని మండిప‌డ్డారు. అయితే పోలీసులు కూడా మంత్రికి అనుకూలంగా న‌డుచుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.ఆదినారాయ‌ణ రెడ్డి మంత్రి ప‌ద‌వికి అన‌ర్హుడ‌ని, క్లబ్బులు, పేకాటలకు ప‌రిమితమ‌య్యార‌ని వెంట‌నే ఆయ‌న‌ను మంత్రిప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.