గ‌వ‌ర్న‌ర్ కు వారిద్ద‌రిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశాం.. వైసీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp
Updated:  2018-11-01 01:41:08

గ‌వ‌ర్న‌ర్ కు వారిద్ద‌రిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశాం.. వైసీపీ

ఏపీ ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై జరిగిన హ‌త్యాయ‌త్నాన్ని ఖండిస్తూ ఆ పార్టీ నాయ‌కులు ఈ కేసుపై నిష్ప‌క్ష‌పాతంగా కేంద్ర బృందాల‌తో విచార‌ణ చేయించాల‌ని కేంద్ర హోం మంత్రికి అలాగే రాష్ట్రప‌తికి విన‌తి ప‌త్రం అంద‌జేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే క్ర‌మంలో ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహాన్ కు కూడా ఈ రోజు వైసీపీ నాయ‌కులు విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. 
 
విన‌తిప‌త్రం గ‌వ‌ర్న‌ర్ కు అంద‌జేసిన త‌ర్వాత వైసీపీ నేత‌లు మీడియాతో మాట్లాడుతూ వాస్త‌వాలు ప్ర‌జ‌లకు  తెలియ నివ్వ‌కుండా ఏపీ ప్ర‌భుత్వం కుట్ర‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని ఎమ్మెల్యే రోజా మండిప‌డ్డారు. అందుకే తాము చంద్రబాబు నాయుడుపై అలాగే రాష్ట్ర డీజీపీ పై చ‌ర్యలు తీసుకోవాల‌ని తాము గ‌వ‌ర్న‌ర్ కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించామ‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే జ‌గ‌న్ హ‌త్యాయ‌త్నంపై టీడీపీ నేత‌లు చేసిన విమ‌ర్శ‌లపై గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేశామ‌ని అన్నారు. 
 
గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత రాష్ట్రంలో త‌న‌కు ఎదురులేద‌ని భావించిన చంద్ర‌బాబుకు స‌డ‌న్ గా ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎ