అడ్డంగా బుక్కైన బాబు ఇదిగో సాక్షం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-16 14:20:55

అడ్డంగా బుక్కైన బాబు ఇదిగో సాక్షం

ఉమ్మ‌డి తెలుగురాష్ట్రాలు రాజ‌ధాని హైద‌రాబాద్ ను డెవ‌ల‌ప్ చేసింది నేనే, సైబ‌ర్ ట‌వ‌ర్ నిర్మించింది నేనే, ప్ర‌తీ ఒక్క‌రు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు అంటే అది నావ‌ల్లే,  నేనే స్మార్ట్ ఫోన్ క‌నిపెట్టింది, మైక్రోసాఫ్ట్ నావ‌ల్లే ఇండియాకు వ‌చ్చింది.  సింధూని బ్యాడ్మింటన్ ఆడ‌మ‌ని చెప్పింది నేనే, బ్రిటీష్ వారితో పోరాడింది మా పార్టీనే, ఇందిరా గాంధీని ఎదిరించింది నేనే ఇలా చెప్పుకుంటూ పోతే ఒక టికాదు రెండు కాదు వినే వారు ఉంటే చాలు... మ‌న ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అదినేత చంద్ర‌బాబు నాయుడు అన్నీ తానే చేసిన‌ట్లు చెప్పుకుంటూ పోతారు. చివ‌రికి దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది తానే అని ప్ర‌చారం చేసుకునే టైప్ చంద్ర‌బాబు నాయుడు. అంతేకాదు మొన్న‌టికి మొన్న ప్ర‌ధాని మోడీ ప్ర‌వేశ పెట్టిన సురక్షాభీమా యోజన పథకాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చంద్రన్న భీమా పేరుతో ప్రమోట్ చేసుకోవాల‌ని చూస్తే అడ్డంగా బుక్క‌య్యారు.
 
అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి సోష‌ల్ మీడియా ద్వారా బుక్క‌య్యారు బాబు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నా క్యాంటిన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అందులో మొద‌టిగా 60 క్యాంటిన్ల‌ను ఏర్పాటు చేసింది టీడీపీ స‌ర్కార్. ఇందులో ఇంట్ర‌స్టింగ్ మ్యాట‌ర్ ఏంటంటే ప్ర‌తీ రోజు 300 వంద‌ల మందికి మాత్ర‌మే అన్నా క్యాంటీన్ భోజ‌న సదుపాయ‌ల‌ను క‌ల్పిస్తోంది. ఇక మ‌రో వైపు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు అధికారంలో లేకున్నా కూడా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాలుగు రూపాయలకే భోజనం అంటూ రాజన్న క్యాంటీన్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 
 
ఇందులో నాణ్య‌మైన ఫుడ్ ల‌భిస్తుండ‌టంతో ప్ర‌జలు ఇక్క‌డికి వ‌చ్చి క‌డుపునిండా అన్నంతిని వెళ్తున్నారు. ఇక వారు తింటున్న ఫోటోల‌ను వైసీపీ నాయ‌కులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇది కూడా వ‌ద‌ల్లేదు. వారు రాజ‌న్న క్యాంటిన్లో తింటున్న ఫోటోను కాపీ చేసి అన్నా క్యాంటిన్ లో భోజ‌నం చేస్తున్న‌ట్లు క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ ఇమేజ్ ను గ‌మ‌నించిన వైసీపీ అభిమానులు, ముఖ్య‌మంత్రి ప్ర‌చారానికి త‌ప్ప మ‌రిదేనికి ప‌నికిరార‌ని, ఇలాంటివి చేయ‌డం బాబుకి వెన్న‌తో పెట్టిన విద్యని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.