బెజ‌వాడ వైసీపీలో క‌ల‌కలం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 06:32:53

బెజ‌వాడ వైసీపీలో క‌ల‌కలం

విజ‌య‌వాడ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. ఇప్ప‌టికే వంగ‌వీటి రంగాపై గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌తో అక్కడ నెలకొన్న సందిగ్ధ‌త అంద‌రికీ తెలుసు. గ‌త కొంత‌కాలంగా వంగ‌వీటి రాధా రాజ‌కీయాల‌పై అనేక పుకార్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. 
 
అయితే బుధ‌వారం నాడు మ‌రో ఊహించ‌ని సంఘ‌న నెల‌కొంది. ప్ర‌స్త‌తం విజ‌య‌వాడ‌లో వైసీపీ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు జ‌రుగుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మానికి రాధాను పిల‌వాలంటూ వంగ‌వీటి వ‌ర్గం డిమాండ్ చేసింది. జై రాధా....జై రంగా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వంగ‌వీటి  అనుచ‌రులు.
 
దయ‌చేసి కూర్చోవాలంటూ వంగ‌వీటి అనుచ‌రుల‌ను మ‌ల్లాది విష్ణు కోరారు.. వంగ‌వీటి రంగా అంటే త‌మ‌కెంతో అభిమాన‌మ‌ని ఈ  కార్యాక్ర‌మానికి రంగాని పిలిచామ‌ని, కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల‌న రాలేక‌పోయాడ‌ని, త‌ప్ప‌కుండా వ‌స్తాడ‌ని వైసీపీ నేత  ఉద‌యభాను స‌ముదాయించారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.