రాజంపేట‌లో ఉక్కు ఉద్య‌మం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

rajampeta ysrcp
Updated:  2018-06-25 13:05:38

రాజంపేట‌లో ఉక్కు ఉద్య‌మం

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన క‌డ‌పుక్కును వెంట‌నే అమ‌లు చేయాలంటూ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అలుపెరుగ‌ని పోరాటం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు వైసీపీ నాయ‌కులు రాజంపేట పార్ల‌మెంట్ ప‌రిధిలో మ‌హాధ‌ర్నాను నిర్వ‌హించారు. ఈ ధ‌ర్నాకు వైసీపీ నాయ‌కుల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 
ఈ సంద‌ర్భంగా వైసీపీ నాయ‌కులు మాట్లాడుతూ, క‌డ‌ప ఉక్కు కోసం త‌మ నాయ‌కులంద‌రూ చిత్తశుద్దితో నాలుగు సంవ‌త్స‌రాలుగా కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పోరాడుతున్నామ‌ని అన్నారు. త‌మ‌కు ప‌ద‌వులు, అధికారాలు ముఖ్యం కావ‌ని ప్ర‌జా శ్రేయ‌స్సే త‌మ‌కు ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీ నాయ‌కుల‌లాగా తాము ప‌ద‌వుల‌కోసం రాజ‌కీయ మ‌నుగ‌డ‌కోసం ధ‌ర్నాలు చేయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
ఒకవేళ‌ తాము అలా చేస్తే ఇంత‌మంది ప్ర‌జలు స్వ‌చ్చందంగా మ‌ద్ద‌తు తెలుప‌ర‌ని అన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను త‌ప్ప‌ని స‌రిగా నిర్మిస్థామ‌ని స్ప‌ష్టం చేశారు. ఉక్కు పరిశ్ర‌మ‌ను నిర్మించలేకపోతే తామంద‌రం రాజీనామాలు చేస్తామ‌ని చెప్పారు.
 
తెలుగు దేశంపార్టీ నాయ‌కులు కేవ‌లం ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ఓట్ల‌ను రాబ‌ట్టుకునేందుకు ధ‌ర్నాల‌ను చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ ధ‌ర్నాలో మాజీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, ఎమ్మెల్సీ గోపాల్‌ రెడ్డి, రాజంపేట‌ పార్లమెంట్ అధ్య‌క్షుడు అమర్నాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.