వైసీపీ నేత‌ను టీడీపీ నేత‌లు వేట‌కొడ‌వ‌ళ్ల‌తో హ‌త్యచేసిన‌ ఘ‌ట‌పై పార్టీ నేత‌ క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and tdp
Updated:  2018-10-12 12:19:12

వైసీపీ నేత‌ను టీడీపీ నేత‌లు వేట‌కొడ‌వ‌ళ్ల‌తో హ‌త్యచేసిన‌ ఘ‌ట‌పై పార్టీ నేత‌ క్లారిటీ

అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం ఆత్మ‌కూరు మండ‌లంలో బుద‌వారం రోజు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు కేశ‌వ‌రెడ్డిని త‌న ప్ర‌త్య‌ర్థి టీడీపీ నాయ‌కులు అత్యంత పాశ‌వికంగా వేట‌కొడ‌వ‌ళ్ల‌తో న‌రికి చంపిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌ర్త తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి మీడియా ద్వారా స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌స్తుతం మంత్రి ప‌రిటాల కుటుంబానికి ప్ర‌జా ధ‌ర‌ణ త‌గ్గుతుంద‌నే ఉద్దేశంతో హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
ప‌రిటాల కుటుంబం ఎప్ప‌టినుంచో ఫ్యాక్ష‌న్ కుటుంబం అని ఇదే విష‌యాన్ని సినిమాల్లో కూడా చూపించార‌ని ప్ర‌కాశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ప‌రిటాల సునిత ప్ర‌తీ మండ‌లానికి త‌న కుంటుంబానికి చెందిన‌ వ్య‌క్తుల‌ను ఇంచార్జ్ గా నియ‌మించుకున్నార‌ని వీరు ప్ర‌జ‌ల మ‌ధ్య వ‌ర్గ‌పోరుకు పాల్ప‌డుతున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. కేశ‌వ‌రెడ్డి హ‌త్య కూడా సునిత సోద‌రుడు ఆత్మ‌కూరు ఇంచార్జ్ బాలాజీ ప్రోత్సాహంతోనే న‌ర‌సింహారెడ్డి హ‌త్య‌చేశారుని ఆరోపించారు.
 
అంతేకాదు గ‌తంలో జ‌రిగిన హ‌త్య‌ల వెనుక ప‌రిటాల కుటుంబ హ‌స్తం ఉంద‌ని ప్ర‌కాశ్ రెడ్డి ఆరోపించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జిల్లా ప‌ర్య‌ట‌న చేసిన స‌మయంలో కేశ‌వ‌రెడ్డిని హ‌త్య‌చేశార‌ని ఈ హ‌త్య‌వెనుక రాజ‌కీయ ప్రోత్సాహం ఉంద‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. పోలీసులు కేశ‌వ‌రెడ్డి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ చేప‌ట్టాల‌ని తోపుదుర్తి డిమాండ్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.