ద‌ద్ద‌రిల్లుతున్న వైసీపీ గ‌ర్జ‌న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-02 13:36:05

ద‌ద్ద‌రిల్లుతున్న వైసీపీ గ‌ర్జ‌న‌

ప్ర‌తిప‌క్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన‌ ప్ర‌త్చేక‌హోదా, రైల్వే జోన్, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను డిమాండ్ చేస్తూ నాలుగు సంవ‌త్స‌రాలుగా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే నేడు తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట అనంత‌పురం జిల్లాలో వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష‌ చేస్తున్నారు. 
 
గ‌తంలో  కూడా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా వైసీపీ నాయ‌కులు విశాఖ ప‌ట్నం, నెల్లూరు జిల్లాలో వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష‌ను విజ‌య‌వంతం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా నేడు అనంత‌పురం జిల్లాలో ఎగ్జిబిషన్ గ్రౌండును  వేదిక‌గా చేసుకుని మ‌రోసారి గ‌ర్జ‌న దీక్ష‌ను చేప‌ట్టారు. ఈ దీక్ష‌లో వైసీపీ ఎమ్మెల్యేలు, ప్ర‌త్యేక హోదా కోసం ప‌ద‌వులను త్యాగం చేసిన మాజీ వైసీపీ ఎంపీలు, అలాగే పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, నాయ‌కులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 
ఈ దీక్షలో ప్ర‌ధానంగా ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నాలుగు సంవ‌త్స‌రాలు కేంద్రంతో పొత్తు పెట్టుకుని ప్ర‌త్యేక హోదా ఏ విధంగా సాధించ‌లేకపోయారో వైసీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. అంతేకాదు హోదా వ‌స్తే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ది కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌తాయే స‌భా ముఖంగా వైసీపీ నాయ‌కులు ప్ర‌జ‌లుకు వివ‌రిస్తున్నారు. అయితే ఈ దీక్ష ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జ‌రుగ‌నుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.