ప్రత్యేక హోదాను పాడెపై పడుకోబెట్టింది..టీడీపీనే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-07-21 05:23:44

ప్రత్యేక హోదాను పాడెపై పడుకోబెట్టింది..టీడీపీనే

గత 4 సంవత్సరాలు గా తెలుగు ప్రజలను బీజేపీ మరియు జనసేనతో కలిసి మోసం చేసి ప్రత్యేక హోదా ను పాడె పై పడుకోబెట్టింది టీడీపీ ప్రభుత్వమే అని వైస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి మండిపడ్డారు. 
 
ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టమని కాంగ్రెస్ కు లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టి బీజేపీ తో జతకట్టి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజి ముద్దంటూ బీజేపీ కొంగు పట్టుకొని పోలేదా అని ఆమె విమర్శించారు.
 
ఈ రోజు భారతదేశం లో యూ టర్న్ ఎక్కువ గా తీసుకున్న ఘనత కేవలం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఆమె అన్నారు.  విభజన చట్టంలోని హామీలను ఏ ఒక్కటి కూడా సాధించి తీసుకురాకుండా ప్రజలను పచ్చిగా మోసం చేసిన నువ్వు ఈ రోజు బీజేపీ మోసం చేసింది అని చెప్పడం విడ్డూరంగా ఉంది అని ఆమె సూచించారు. 
 
బీజేపీ, టీడీపీ కలసి పార్లమెంటులో చేసిన విన్యాసాలు ప్రజలు గమనించారని ఇకనైనా ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి 24న ఇచ్చిన బందు పిలుపుకు టీడీపీ ఎంపీల చేత రాజీనామాలు చేపించి భాగస్వాములు కావాలి అని కోరారు.
 
ప్రత్యేకహోదా కొరకు మొట్టమొదటి నుండి అలుపెరుగని పోరాటం చేస్తున్న ఒకేఒక్క‌ నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని ఆమె గుర్తు చేశారు. ఈ  సందర్భం గా 24 న బందుకు పార్టీలకు అతీతం గా కలిసి వస్తేనే ప్రత్యేకహోదా సాధ్యమవుతుంది అని ఆమె సూచించారు