ఆ గతే టీడీపీకి పడుతుంది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-06 18:42:46

ఆ గతే టీడీపీకి పడుతుంది

ఏపీకీ ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాలంటూ నాలుగు సంవ‌త్స‌రాలుగా నిర్విరామంగా కేంద్రం పై వైసీపీ పోరాటం చేస్తున్న విధానాన్ని, అదే విధంగా అధికార టీడీపీ రోజుకో మాటమాట్లాడుతూ చిత్త‌శుద్దిలేని పోరాటాలు చేస్తుండ‌డాన్ని కూడా రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌​యాదవ్ తెలిపారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని విమ‌ర్శించారు.... ప్ర‌త్యేక‌హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు పార్లమెంటులో 12 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఏం పీకుతున్నారని ప్రశ్నించారు.
 
వైయ‌స్ జ‌గ‌న్ నేతృత్వంలో మొద‌టి నుంచి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం, ప్ర‌త్యేక‌హోదా కోసం స్ప‌ష్ట‌మైన విధానంతో పోరాటం కోన‌సాగిస్తున్నామ‌ని తెలిపారు. దిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు అవిశ్వాస తీర్మానం పై చర్చ జరగడానికి ఏఐడీఎంకే సభ్యులతోను వారి పార్టీ అధినేత‌ల‌తోను క‌నీసం చ‌ర్చించ‌లేద‌ని తెలిపారు.  తమిళనాడు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక్కరోజు చర్చ జరగనివ్వాలని అడగని దిక్కుమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు...హేమాహేమీలను కలుస్తానని చెప్పి హేమమాలినిని క‌లిసి వ‌చ్చావా అని చంద్ర‌బాబును  ఎద్దేవా చేశారు.
 
చంద్రబాబు ఇప్పటికైనా దిక్కుమాలిన డ్రామాలు ఆపి ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడాలని సూచించారు. ప్ర‌త్యేక హోదా కోసం చిత్తశుద్దితో ఉద్య‌మం చేస్తున్న‌, వామపక్షాలతో వైసీపీ కలసి పోరాటం చేస్తోంద‌ని తెలిపారు. అలాగే ప్రత్యేక హోదా సాధన సమితితో కూడా కలసి పోరాడుతున్నామ‌ని అన్నారు. వైసీపీ ఎంపీల‌ రాజీనామాలు ఆమోదింపజేసుకుని ఎన్నికలకు వెళ్లి గెలిచి తీరుతామ‌ని స‌వాల్ విసిరారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీకి బుద్ధి చెప్ప‌డానికి ప్రజలు సిద్దంగా ఉన్నార‌ని తెలిపారు. ఈ రాష్ట్రంలో శాశ్వతంగా టీడీపీ కనుమరుగు అయ్యే పరిస్థితి తొందరలోనే రానుంది అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.