కుమ్మ‌క్కు అయినా నువ్వు ఏం పీ... లేవు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-09 17:51:24

కుమ్మ‌క్కు అయినా నువ్వు ఏం పీ... లేవు

త‌మ నాయ‌కుడు రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌గానే భార‌తదేశంలో మ‌హామ‌హా నాయ‌కులు కాంగ్రెస్ పార్టీ అదినేత్రి సోనియాగాంధీని చూసి వ‌ణికి పోతుంటే కేంద్రాన్నే వ‌ణికించి, గ‌డ‌గ‌డ‌లాడించిన‌ వ్య‌క్తి  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ స్ప‌ష్టం చేశారు. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా గుంటూరులో ఏర్పాటు చేసిన వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష‌లో ఆయ‌న మాట్లాడుతూ ఈ రోజు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాజ్య‌స‌భ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి అయితే మ‌ద్ద‌తు తెలిపారో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీతో కుమ్మ‌క్కు అయి క‌లిసి వ‌చ్చినా ఏమీ పీ...లేని వ్య‌క్తి, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి మాట్లాడుతున్నార‌ని అనిల్ కుమార్ యాద‌వ్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. 
 
ఎవ‌రు బ‌య‌ప‌డుతారో ఎవ‌రు వెన్ను చూపి పారిపోతారో ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అధికార బలంతో త‌మ పార్టీ నాయ‌కులను 23 మందిని తీసుకుంటే వారితో రాజీనామా చేయించు ఎన్నిక‌ల‌కు పోదాము ద‌మ్ముంటే రా...! అని చెబితే రాలేని పిరికి పందా తెలుగుదేశం పార్టీ అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేని మీరు త‌మ నాయ‌కుడి గురించి మాట్ల‌డే అర్హ‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు. 
 
2014 ఎన్నిక‌ల్లో అయినా 2019 ఎన్నిక‌ల్లో అయినా ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకుని ద‌మ్మున్న నాయ‌కుడిగా ఒక్క‌డిగానే ముందుకు వ‌స్తార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీసారి టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌లు వ‌స్తే అధికార దాహం కోసం ఎవ‌రితో పొత్తు పెట్టుకుందామా, ఎవ‌రితో పోదామా అని వెంప‌ర్లాడుతుంటార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జాతీయ పార్టీ కానీ, ప్రాంతీయ పార్టీల‌తో పొత్తు పెట్టుకుని వ‌చ్చినా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ నాయ‌కుడు ఒక్క‌డే వ‌స్తార‌ని అనిల్ స్ప‌ష్టం చేశారు.  
 
పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తెలుపుతున్న ప్ర‌జా మ‌ద్ద‌తును చూసి టీడీపీ నాయ‌కుల‌ వెన్నులో వ‌ణుకు వ‌స్తోంద‌ని ఆరోపించారు.  అయితే ప్ర‌స్తుతం రాష్ట్రానికి గ్ర‌హ‌ణం ప‌ట్టినట్లు నారా లోకేశ్ పప్పు మాట‌ను కూడా వినాల్సి వ‌స్తోంద‌ని ఆయ‌న  మండిప‌డ్డారు. ఈ మ‌ధ్య‌కాలంలో లోకేశ్, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఒక అవినీతి పుత్రుడ‌ని విమ‌ర్శ‌లు చేశార‌ని అయితే ఆయ‌న ఎవ‌రి పుత్రుడ‌ని అనీల్ కుమార్ విమ‌ర్శించారు. 
 
లోకేశ్ ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూస్తే ఆయ‌న తండ్రి నాటి నుంచి నేటి వ‌ర‌కు వెన్నుపోట్లే అనిల్ కుమార్ గుర్తు చేశారు. అయితే వైఎస్ కుటుంబం త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను ద‌మ్ము, ధైర్యంతో ముందుండి ఎదుర్కునే కుంటుంబం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలుగు స‌రిగ్గా మాట్లాడ‌లేని నువ్వు... ఒక కాగితం నీ ముందు పెట్టినా మాట్లాడ‌లేని నువ్వు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శించ‌డం విడ్డూరంగా ఉంద‌ని అనిల్ కుమార్ అన్నారు. లోకేశ్ కామెడి పాత్ర‌కు ఎక్కువ సీరియ‌స్ పాత్ర‌కు త‌క్కువ. ఎవ‌రు చేయాల్సిన పాత్ర వారు చేస్తే బాగుంటుంద‌ని అనిల్ వార్నింగ్ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.