బుగ్గ‌న సంచ‌ల‌న స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mla buggana rajendranadh reddy
Updated:  2018-06-19 04:59:20

బుగ్గ‌న సంచ‌ల‌న స‌వాల్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంధ్ర‌నాథ్ రెడ్డి పీఏసీ చైర్మ‌న్ గా ఉండి ప‌లు కీల‌క విష‌యాలు కేంద్రానికి రిపోర్టుగా స‌మ‌ర్పించారు అని ఇటు తెలుగుదేశం విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.. ఇక దీనిపై నాలుగురోజులుగా తెలుగుదేశం నాయ‌కులు ప‌లు విమ‌ర్శ‌లు చేస్తూ బుగ్గ‌న తీరుపై మండిప‌డుతున్నారు.. తాను ఎవ‌రిని క‌ల‌వ‌లేదు ఎటువంటి స‌మాచారం ఇవ్వ‌లేదు అని ఇటు బుగ్గ‌న చెబుతున్నా ఆయ‌న‌ని టార్గెట్ చేస్తోంది అధికార పార్టీ.
 
ఇక తాజాగా బుగ్గ‌న దీనిపై మ‌రోసారి ఫైర్ అయ్యారు..అలాగే టీడీపీ నేత‌ల‌పై ప్రివిలేజ్ క‌మిటీకి ఫిర్యాదు చేశారు.. త‌న హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నార‌ని, త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగిస్తున్నారు అని ఆయ‌న ఆరోపించారు.. ముఖ్యంగా గుంటూరు జిల్లా గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ లపై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న క్రింద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఫిర్యాదులో తెలియ‌చేశారు.
 
బుగ్గ‌న ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదుచేశారు ప్రివిలేజ్ క‌మిటీకి.. త‌న‌పై తెలుగుదేశం నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు... త‌న పై ఆరోప‌ణ‌లు చేశారు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్దం అంటూ ఆయ‌న స‌వాల్ చేశారు. రాష్ట్రానికి సంబంధించిన స‌మాచారాన్ని బీజేపీ నాయ‌కుల‌కు చేర‌వేరుస్తున్నాను అని త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు ఆయ‌న‌.ఏపీ భవన్‌లో లాగ్ బుక్ ట్యాపరింగ్ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.. త‌మ‌కు బీజేపీ కి మ‌ధ్య బంధం ఉంది అని అన‌డం అవాస్త‌వాలు అని ఆయ‌న విమ‌ర్శించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.