సింగ‌పూర్ ర‌హ‌స్యాన్ని గుట్టు ర‌ట్టు చేసిని వైసీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-13 16:00:54

సింగ‌పూర్ ర‌హ‌స్యాన్ని గుట్టు ర‌ట్టు చేసిని వైసీపీ ఎమ్మెల్యే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు 2014లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అనేక సార్లు సింగ‌పూర్ కు వెళ్లార‌ని అయితే ఈ ప‌ర్య‌ట‌న‌లో ఏం సాధిచారో మీడియా ద్వారా వివ‌రించాల‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డోన్ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్రనాథ్ మండిప‌డ్డారు.ఈ రోజు హైద‌రాబాద్ పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌ధాన మంత్రి మోడీ త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే  అనేక సార్లు విదేశాల‌కు ప‌ర్య‌టించార‌ని ఆయ‌న మండిపడ్డారు.
 
సింగ‌పూర్ కంపెనీ ఏర్పాటు చేసిన మీటింగ్ కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి ఆహ్వానం పంప‌లేద‌ని కానీ ఆయ‌నే టికెట్ కొనుక్కొని సింగ‌పూర్ కు వెళ్లార‌ని బుగ్గ‌న ఆరోపించారు. వాస్త‌వానికి సింగ‌పూర్ దేశ‌స్తులు ప్ర‌వేశ‌పేట్టిన మీటింగ్ లో రెండు ర‌కాల క్యాట‌గిరికి చెందిన వారు ఈ మీటింగ్ కు హాజ‌రు కావాల్సి ఉంది.  అందులో మొద‌టిగా మేయ‌ర్స్ ఫోర‌మ్స్, రెండ‌వ‌ది యంగ్ లీడ‌ర్స్ హాజ‌రు కావాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఏ క్యాట‌గిరికి చెంద‌ని వ్య‌క్తి సింగ‌పూర్ మీటింగ్ కు ఎలా హాజ‌రు అవుతార‌ని బుగ్గ‌న ప్ర‌శ్నించారు. 
 
కేవలం ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసి సింగపూర్ నుంచి పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని చెప్పి  ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ్య‌వ‌సాయ రుణమాఫి స‌గం చేశార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. ఏపీతో సింగ‌పూర్ వాళ్లే లబ్దిపొందారు త‌ప్ప మ‌న రాష్ట్రం బాగుప‌డ‌లేద‌ని బుగ్గ‌న రాజేంద్రనాథ్ మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.