ఆ విష‌యంలో బాబు సూప‌ర్ స్పెష‌లిస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-13 15:42:55

ఆ విష‌యంలో బాబు సూప‌ర్ స్పెష‌లిస్ట్

ఏపీ ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష‌మైన‌ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న ప‌రిపాల‌న‌పై నిత్యం విమ‌ర్శ‌లు చేస్తునే ఉంటారు. అయితే తాజాగా క‌ర్నూల్ జిల్లా డోన్ ఎమ్మెల్యే  బుగ్గన రాజేంద్రనాథ్‌ మ‌రోసారి పార్టీ కార్యాలయంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్పయాత్ర ఒక ఉద్య‌మంలా మారింద‌ని అన్నారు.
 
దేశంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడికి రానంత విధంగా జ‌గ‌న్ కు ప్ర‌జాధ‌ర‌ణ వ‌స్తుంద‌ని, ఈ పాద‌యాత్ర‌ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని బుగ్గ‌న అన్నారు. జ‌గ‌న్ లో ఉన్న నిజాయితీనే ఆయ‌న‌ను ముందుకు న‌డిపిస్తుంద‌ని అన్నారు. త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబులాగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి రార‌ని, ఆయ‌న అమ‌లు చేయ‌బోయే హామీల‌ను మాత్ర‌మే ప్ర‌క‌టించార‌ని, ఈ హామీలు ప్ర‌జ‌ల‌కు న‌చ్చినందుకే ఏ నాయ‌కుడికి రానంత విధంగా ప్ర‌జాధ‌ర‌ణ వ‌స్తుంద‌ని అన్నారు.
 
చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయింద‌ని, ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో టీడీపీ నాయ‌కులు ఒక్క‌చోటైనా అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేశారా అని ప్ర‌శ్నించారు బుగ్గన రాజేంద్రనాథ్‌. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన క్లియరెన్స్ లు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి  హయాంలోనే పూర్తి అయింద‌ని అన్నారు. 
 
అయితే 2014లో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పోల‌వ‌రాన్ని మ‌రిచిపోయి పట్టిసీమను ప్రారంభించార‌ని బుగ్గ‌న మండిప‌డ్డారు. ప్రతి సోమవారం సూపరిండెంట్‌లా చంద్ర‌బాబు పోలవరం వెళ్లడం హ్యాస్యాస్పదంగా ఉంద‌ని అన్నారు. అంతేకాదు అక్క‌డికి వెళ్లి ఇంజనీర్‌ చేయాల్సిన పనిని ముఖ్యమంత్రి చేయడమేంటని బుగ్గ‌న ప్ర‌శ్నించారు.
 
రాష్ట్రాన్ని పాలించ‌మ‌ని ప్ర‌జ‌లు న‌మ్మ‌కంతో అధికారాన్ని చంద్ర‌బాబు చేతిలోపెడితే, వారి న‌మ్మ‌కాన్ని చంద్ర‌బాబు వ‌మ్ము చేశార‌ని మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి కేవ‌లం త‌న స్వ‌లాభం కోసం రాష్ట్రాన్ని సింగ‌పూర్ ప్ర‌భుత్వానికి తాక‌ట్టు పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. అంతేకాదు వారికి చంద్ర‌బాబు స‌ర్వ‌హక్కుల‌ను రాసిస్తున్నార‌ని  అన్నారు. ప్ర‌జ‌లను త‌ప్పుదోవ ప‌ట్టించడంలో చంద్ర‌బాబు స్పెష‌లిస్ట్ అని ఆయ‌న‌ను మించిన నాయ‌కుడు ఈ దేశంలో లేర‌ని తెలిపారు. ఇక చంద్ర‌బాబు ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానిక ప్ర‌జ‌లు సిద్దంగా ఉన్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని భూ స్థాపితం చేసేందుకు ప్ర‌జ‌లు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నార‌ని బుగ్గ‌న తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.