ఆయ‌న ఎజెండా ఏంటి..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-09 04:51:17

ఆయ‌న ఎజెండా ఏంటి..

టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే పీఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అవకాశవాదానికి నిజమైన అర్థం చంద్రబాబు అని  అయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టవని, ఆయన పాలనే రాష్ట్రానికి దురదృష్టకరమని ధ్వజమెత్తారు. 
 
బాబు అబద్ధాల వల్లే రాష్ట్రానికి వచ్చే నిధులు వెనక్కి వెళ్లాయ‌ని, ఇప్పటికైనా చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మానుకొని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రత్యేక హోదా కావాలని మేం అడిగితే...చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని, విశాఖ రైల్వేజోన్‌, కడప స్టీల్‌ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ సహా దేన్నీ పట్టించుకోలేదు. 
 
రాష్ట్రానికి లక్షలకోట్ల పెట్టుబడులు వచ్చినట్లు బిల్డప్‌ ఇచ్చారు. డ్రామాలు వేయడం, గుండు కొట్టుకోవడం కాదు..చిల్లర వేషాలు వేయడం మానేసి..రాష్ట్రానికి ఏం కావాలో డిమాండ్‌ చేయండని బుగ్గ‌న తీవ్ర స్ధాయిలో మండిప‌డ్డారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ టీడీపీ కూటమి నుంచి ఎప్పుడు బయటకొచ్చారని ఆయ‌న ప్రశ్నించారు. అసలు పవన్‌ కల్యాణ్‌ ఎజెండా ఏంటో ఎవరికీ అర్థం కావడం లేద‌ని ఎమ్మెల్యే బుగ్గన అన్నారు.
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.