అందుకు చంద్ర‌బాబు సిద్ద‌మా వైసీపీ ఎమ్మెల్యే స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-19 15:33:55

అందుకు చంద్ర‌బాబు సిద్ద‌మా వైసీపీ ఎమ్మెల్యే స‌వాల్

2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో అద్వాన‌మైన ప‌రిపాల‌న చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.
 
ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు బోగ‌స్ స‌ర్వేల‌ను నిర్వ‌హిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.అయితే  స‌ర్వే ప్ర‌కారం నిజంగా ప్ర‌జ‌లు తెలుగుదేశంపార్టీకి అనుకూలంగా ఉంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌క్ష‌ణ‌మే టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి బై ఎల‌క్షన్లు జ‌ర‌పాల‌ని స‌వాల్ విసిరారు.
 
గతంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సుమారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను అక్ర‌మంగా టీడీపీలోకి చేర్చుకుని, రాజ్యాంగానికి విరుద్దంగా టీడీపీలో ఫిరాయించిన ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వుల‌ను ఇచ్చార‌ని గోపిరెడ్డి మండిప‌డ్డారు. 
 
దేశంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడు రాజ్యాంగానికి విరుద్దంగా పార్టీల్లో చేర్చుకుని మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌లేద‌ని. కేవ‌లం మ‌న రాష్ట్రంలోనే ఇచ్చార‌ని గోపిరెడ్డి విమ‌ర్శించారు. దేశ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు నాయుడు చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని ఆయ‌న అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.