సీఎం ర‌మేష్ పై వైపీసీ ఎమ్మెల్యే సూప‌ర్ డైలాగ్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-23 16:19:37

సీఎం ర‌మేష్ పై వైపీసీ ఎమ్మెల్యే సూప‌ర్ డైలాగ్స్

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను వెంట‌నే ఏర్పాటు చేయాలంటూ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు క‌డ‌ప‌లో ఈ రోజు మ‌హా ధ‌ర్నాను చేప‌ట్టారు. ఈనెల 23 నుంచి 26వ తేది వ‌ర‌కూ ఈ ధర్నా చేప‌ట్ట‌నున్నారు. ఈ ధ‌ర్నాలో వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ, 2014లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒక పెద్ద కంక‌ణం క‌ట్టుకున్నార‌ని, ఎట్టి పరిస్థితిలో క‌డ‌ప‌ను అభివృద్ది చేయ‌కూడదు అనే నినాదంతో ఉన్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.
 
అందుకోస‌మే ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో టీడీపీ నాయ‌కులు ఎక్క‌డ‌ కాని ఉక్కు ప‌రిశ్ర‌మ గురించి చ‌ర్చ జ‌రుప‌లేద‌ని మండిప‌డ్డారు. పైగా తాము గ‌తంలో క‌డ‌ప ఉక్కు కోసం ధ‌ర్నాలు చేస్తే త‌మ‌పై అక్ర‌మంగా కేసులు పెట్టార‌ని రాచ‌మల్లు గుర్తు చేశారు. క‌డ‌ప జిల్లాలో ఉక్కు పరిశ్ర‌మను ఏర్పాటు చేస్తే రాయ‌ల‌సీమ‌లో ఉన్న ప్ర‌తీ నిరుద్యోగికి ఉద్యోగ అవ‌కాశాలు వ‌స్తాయ‌ని అలాగే క‌డ‌ప జిల్లాలో భూముల విలువ‌లు పెరుగుతాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 
2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బీజేపీతో పొత్తుపెట్టుకుని తాము అధికారంలోకి వ‌స్తే క‌డ‌లో ఖ‌చ్చితంగా ఉక్కు ప‌రిశ్రమ‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పి ఇంత‌వ‌ర‌కూ ఉక్కు ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయ‌లేద‌ని రాచ‌మ‌ల్లు మండిప‌డ్డారు. ఇక‌ ఇప్పుడు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో సీఎం ర‌మేష్ నాయుడు నిరాహార దీక్ష చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
ర‌మేష్ దీక్ష‌కు దిగి సుమారు నాగులు రోజులు పూర్తి కావ‌స్తున్నా ఆయ‌న ముఖంలో కొద్దిగ కూడా దీక్ష చేసిన‌ట్లు క‌నించ‌లేద‌ని, ఒక కొత్త పెళ్లి కొడులాగా ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. తాను 48 గంట‌లు దీక్ష చేసిన‌ప్పుడు నీర‌సం వ‌చ్చి గ్యాస్ ట్ర‌బుల్ వ‌చ్చింద‌ని, కానీ ర‌మేష్ లో అలాంటిది క‌నించ‌లేద‌ని ఎద్దేవా చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.