టీడీపీ బ‌స్సు యాత్ర‌తో వ‌స్తే ఆ ప‌ని చేయండి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-12 18:46:05

టీడీపీ బ‌స్సు యాత్ర‌తో వ‌స్తే ఆ ప‌ని చేయండి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించాలంటూ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన  త్యాగం చిర‌స్మ‌ర‌నీయమ‌ని రాష్ట్ర వ్యాప్తంగా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు ప్ర‌జ‌లు... అయితే వారికి మ‌ద్ద‌తు తెలుపుతూ వైసీపీ అధినేత ఆదేశాల మేర‌కు, ఆలూరు ఎమ్మెల్యే  గుమ్మనూరు జయరాం పార్టీ కార్య‌క‌ర్త‌లతో క‌లిసి  ఆలూరు బ‌స్టాండ్ ఆవ‌ర‌ణ‌లో  రిలే నిరాహార దీక్ష చేప‌ట్టారు..ఈ దీక్ష నేటితో ఐదోరోజుకి చేరుకుంది. 
 
ఈ సంద‌ర్బంగా గుమ్మ‌నూరు జ‌య‌రాం మాట్లాడుతూ..?  గ‌తంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా  వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ని, ప్ర‌త్యేక ప్యాకేజీ వ‌ల్ల అనేక ఉప‌యోగాలు ఉంటాయ‌ని చెప్పార‌ని అన్నారు... కానీ ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కావాలంటూ మాట‌మార్చుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.. ఇదే మాట నాలుగు సంవ‌త్స‌రాలు నుంచి అని ఉంటే,  రాష్ట్రానికి ఎప్పుడో ప్ర‌త్యేక హోదా వ‌చ్చేద‌ని జ‌య‌రాం ఆరోపించారు.
 
చంద్ర‌బాబు త‌మ ఎంపీల‌తో రాజీనామా చేయించకుండా బ‌స్సు యాత్ర‌తో మ‌రో నాట‌కానికి తెర‌లేపుతున్నార‌ని మండిప‌డ్డారాయ‌న‌... బ‌స్సుయాత్ర‌లో పాల్గొనే టీడీపీ ఎంపీలంద‌రిని ప్రజల చేత‌ రాళ్ల‌తో దాడి చేయిస్తామ‌ని అన్నారు.. ప్ర‌త్యేక హోదా పై ప్ర‌తీ ఒక్క‌రికి అవ‌గాహ‌ణ ఉంద‌ని, మ‌ళ్లీ ఇప్పుడు టీడీపీ నాయ‌కులు బ‌స్సు యాత్ర‌తో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌ణ చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న తెలియ‌చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.