వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-15 14:58:56

వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రుకు వ‌స్తున్న నేప‌థ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. త‌మ అవస‌రాల రిత్యా దేశ రాజ‌ధాని అయిన ఢిల్లీకి వెళ్లే టీడీపీ నాయ‌కులు లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారని వైసీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు .
 
అయితే ఇదే క్ర‌మంలో క‌ర్నూల్ జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ కూడా ఈ మ‌థ్య కాలంలో వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల రిత్య డిల్లీకి వెళ్లారు. అయితే ఆయ‌న‌పై టీడీపీ నాయ‌కులు లేనిపోని నింద‌లు వేస్తున్నారు. అంతేకాదు ప్ర‌ముఖ ఎల్లో మీడియా కూడా ఈ వార్త‌ను హైలెట్ చేస్తూ బుగ్గ‌న‌పై లేనిపోని వార్త‌ల‌ను రాసింది. ఇక తాజాగా ఈ వార్త‌ల‌పై బుగ్గ‌న స్పందిస్తూ మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ త‌నపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్లో ఏ మాత్రం వాస్త‌వం లేద‌ని అన్నారు. తాను కేవ‌లం డిల్లీకి వ్య‌క్తిగ‌త ప‌నుల మీద వెళ్లాన‌ని, ఆ స‌మ‌యంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ విప్‌ కూన రవికుమార్‌ను ఏపీ భవన్‌లో కలిస్తే మీడియా త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు వార్త‌లు రాస్తుంద‌ని బుగ్గ‌న మండిప‌డ్డారు. మీడియా యాజ‌మాన్యం ఇలాంటి ఫేక్ న్యూస్ రాసి రాజ‌కీయ నైతిక విలువ‌ల‌నే కాకుండా జ‌ర్న‌లిజం ప‌రువు కూడా తీస్తోంద‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. డిల్లీలో ఏపీ భ‌వ‌న్ ఒక్క‌టే ఉంద‌ని అందులో ప్ర‌తీ ఒక్క రాజ‌కీయ నాయ‌కులు వెళ్తుంటార‌ని అందులో తాను త‌న అవ‌సరాల రిత్యా వెళ్ల‌వ‌ల‌సి వ‌చ్చింద‌ని అన్నారు. 
 
అయితే తాను వెళ్ల‌క ముందే ఏపీ భ‌వ‌న్ లో అన్ని పార్టీల‌కు  సంబంధించి నాయ‌కులు ఉన్నార‌ని, వారంద‌రిని  తాను  ప‌లుక‌రించాన‌ని అని అన్నారు. అయితే మీడియా యాజ‌మాన్యం మాత్రం తాను బీజేపీ నాయ‌కుల‌తో మాట్లాడింది తీసుకుని టీడీపీ వీప్ తో మాట్లాడింది క‌ట్ చేసి ప్లే చూపిస్తున్నార‌ని  మండిప‌డ్డారు.  బీజేపీ నాయ‌కుల‌తో పాటు టీడీపీ విప్‌ కూడా నన్ను ఆలింగనం చేసుకున్నారని అయితే ఆయన వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్టా అని ప్రశ్నించారు. ఇక అచ్చెన్నాయుడుపై బుగ్గ‌న తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న‌ మంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదు, ఆయనకు మెదడు లేదని మరోసారి నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.