చంద్ర‌బాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 17:08:44

చంద్ర‌బాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన క‌డప ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు నాలుగు సంవ‌త్స‌రాలుగా పోరాటం చేస్తున్నామ‌ని రాయ‌చోటి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.
 
గ‌తంలో తాము క‌డ‌ప ఉక్కు కోసం పోరాటం చేస్తుంటే అడ్డుకున్నది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే అని విమ‌ర్శ‌లు చేశారు. ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో చంద్ర‌బాబు నాయుడు అన్నిచోట్ల శంకుస్థాప‌న చేసి ఆ భూముల‌ను త‌న పార్టీ నాయ‌కుల‌కు క‌ట్ట‌బెట్టి అధికార దుర్వినియోగం చేస్తున్నార‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు.
 
క‌డ‌ప ఉక్కు విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్ర ప్ర‌భుత్వాన్నిమెడ‌లు వంచి స్టీల్ ఫ్యాక్ట‌రీని సాధించ‌కుండా రాష్ట్రంలో డ్రామాలు ఆడుతున్నార‌ని శ్రీకాంత్ రెడ్డి విమ‌ర్శలు చేశారు. 40 సంవత్స‌రాల సుదీర్ఘ‌ రాజ‌కీయ జీవితంలో ఒక్క పోరాటం అయినా చేశారా..అని శ్రీకాంత్ రెడ్డి, చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. త‌న‌ రాజ‌కీయ జీవితంలో ఎప్పుడు చూసిని వంచించ‌డం, వెన్నుపోటు రాజ‌కీయాలు త‌ప్ప ప్ర‌జ‌ల కోసం పోరాటం చేసిన చ‌రిత్ర చంద్ర‌బాబు నాయుడుకి లేద‌ని శ్రీకాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.
 
ఇప్పుడు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణంలో ఓట్లను రాబ‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు నాయుడు దీక్ష‌ల‌పేరుతో దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీడీపీ నాయ‌కులకు ప‌ద‌వులు డ‌బ్బు త‌ప్ప రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు అవ‌స‌రం లేద‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. అలాగే పోల‌వ‌రం ప్రాజెక్ట్ విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు ఎన్నో డ్రామాలు ఆడుతూ క‌మీష‌న్ల కోసం క‌క్కుర్తి ప‌డుతున్నార‌ని విర్శించారు. 
 
రాష్ట్ర శ్రేయస్సు క‌న్నా చంద్ర‌బాబుకు క‌మీష‌న్లే ముఖ్య‌మని పేర్కొన్నారు శ్రీకాంత్ రెడ్డి. క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌లు అంటే చంద్ర‌బాబు నాయుడుకి క‌డుపుమంటని అందుకే క‌డ‌ప ఉక్కు పరిశ్ర‌మ‌కోసం మాట్ల‌డ‌లేద‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. చంద్ర‌బాబు చేత‌గానిత‌నం వల్లే రాయ‌ల‌సీమ ఎడారిగా మారిపోతుంద‌ని రానున్న రోజుల్లో చంద్ర‌బాబు చ‌రిత్ర హీనుడిగా మారడం ఖాయం అని శ్రీకాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.