శ్రీకాంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఆరునెల‌ల్లో రాజీనామా చేస్తాం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-23 18:20:25

శ్రీకాంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఆరునెల‌ల్లో రాజీనామా చేస్తాం

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి మ‌రోసారి ఎపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై అలాగే టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీడీపీ అధికారంలోకి వ‌స్తే ఖ‌చ్చితంగా క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పి ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు.ఇక ఇప్పుడు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి కాబ‌ట్టి ఓట్లను రాబ‌ట్టేందుకు టీడీపీ పార్ల‌మెంట్ స‌భ్యులు నాట‌కాలు ఆడుతున్నార‌ని ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ్చారు.
 
అయితే వారు ఎన్ని దీక్ష‌లు చేసినా కూడా రాష్ట్ర ప్ర‌జ‌లు టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. గతంలో క‌డ‌ప ఉక్కు కోసం దీక్ష‌లు చేస్తామ‌ని చెప్పి సాధార‌ణ ప్ర‌జ‌లు క‌డ‌ప టీడీపీ నాయ‌కుల ద‌గ్గ‌ర‌కు వెళ్తే హేళ‌న చేసి మాట్లాడార‌ని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు తొమ్మిది సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టార‌ని, అయితే ప్ర‌స్తుతం నాలుగు సంవ‌త్స‌రాలు పుర్తి చేసుకున్నార‌ని, అయితే క‌డ‌ప జిల్లాలో ఒక్క ప‌రిశ్ర‌మ అయిన స్థాపించారా అని శ్రీకాంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.
 
దివంగ‌త నేత ముఖ్య‌మంత్రి రాజశేఖ‌ర్ రెడ్డి పుణ్య‌మా అంటూ క‌డ‌ప జిల్లాలో రిమ్స్ ఆసుప‌త్రి, శిల్పారామం పార్క్, అలాగే ప‌ట్నంలో రోడ్ల‌ను ఏర్పాటు చేశార‌ని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే చంద్ర‌బాబు నాయుడు మాత్రం క‌డ‌ప‌లో చిన్న ప‌రిశ్ర‌మ‌ను కూడా స్థాపించ‌లేక పోయార‌ని విమ‌ర్శించారు. 2019 లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఖ‌చ్చితంగా కేంద్రంతో ఎలాంటి సంబంధం లేకుండా ఆరు నెల‌లు పూర్తి కాక‌ముందే తాము క‌డ‌ప‌లో ఉక్కుప‌రిశ్ర‌మ‌ను నిర్మిస్థామ‌ని హామీ ఇచ్చారు. ఒక‌వేళ‌ తాము నిర్మంచ లేకతే ప్రజ‌ల‌చేత ఎన్నుకోబ‌డిన నాయ‌కుడిగా తామంద‌రం ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్థామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు శ్రీకాంత్ రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.