బాబు రాజ్యాంగ విలువ‌లు పాతేశారు వైసీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and chandrababu
Updated:  2018-09-20 12:04:11

బాబు రాజ్యాంగ విలువ‌లు పాతేశారు వైసీపీ ఎమ్మెల్యే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అధికారంలోక వ‌చ్చి నాలుగున్నర సంవ‌త్స‌రాలు పూర్తి అయినా కూడా ఆయ‌న ప్ర‌క‌టించిన హామీలు అమ‌లు కాలేదని ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి మండిప‌డ్డారు. ఈ  రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, గతంలో చంద్ర‌బాబు కేంద్రంతో పొత్తులో భాగంగా రాష్ట్రానికి సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక‌హోదాను మ‌రిచి ప్ర‌త్యేక ప్యాకేజి కావాల‌ని అన్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు.
 
అయితే ఇప్పుడు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణంలో యూట‌ర్న్ తీసుకుని ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటు న్నార‌ని కోన మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం హోదా పేరు చెప్పి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర ప్ర‌జ‌లను మోసం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. గతంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లందరితో పాటు ప్ర‌తిప‌క్షాలు కూడా కోరుకుంటే అందుకు చంద్రబాబు అడ్డుప‌డ్డార‌ని విమ‌ర్శించారు.
 
అంతేకాదు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల‌కు గండి కొట్టింది చంద్ర‌బాబు కాదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. టీడీపీ నాయ‌కులు వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోస‌మే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను వాడుకున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అధికార బ‌లంతో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేర్చుకుని రాజ్యాంగ విలువ‌ల‌ను పాతేశార‌ని కోన ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.