గెలుపుకు తిరుగే లేదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-08 18:10:10

గెలుపుకు తిరుగే లేదు

ఎన్నోఏళ్లు నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌గా వ్య‌వ‌హరిస్తున్న జిల్లాలు ఏవి అని అడిగితే...వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది మొద‌టిగా అనంత‌పురం జిల్లా, ఆ త‌ర్వాత గుంటూరు జిల్లా. ఈ రెండు జిల్లాలు ఎప్ప‌టి నుంచో టీడీపీకి కంచుకోట‌గా వ్య‌హరిస్తూ వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆలోచిస్తే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈ రెండు జిల్లాల నుంచి టీడీపీకి బీట‌లు వాలే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది.
 
ముఖ్యంగా చెప్పాలంటే గుంటూరు జిల్లా, ఈ జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే 2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో కేవ‌లం ఈ జిల్లా నుంచి వైసీపీ ఐదు అసెంబ్లీ స్థానాలు మాత్ర‌మే ద‌క్కించుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ అధికారంలో రావ‌డ‌నికి గుంటూరు జిల్లా కార‌ణం అని చెప్పాలి. 
 
ఇక ఈ జిల్లాపై వైసీపీ నాయ‌కులు స్కెచ్ వేశారు. ఎక్క‌డైతే పోగోట్టుకున్నామో అక్క‌డి నుంచే సాధించుకోవాల‌నే ఉద్దేశ్యంతో జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా ఈ జిల్లాలో త‌న మైలేజ్ పెంచి అధికార నాయ‌కులు చేస్తున్న అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. దీంతో ప్ర‌జ‌లు కూడా ఆలోచించ‌డం మొద‌లు పెట్టారు.
 
ఇక ఈ జిల్లాలో గ‌త నాలుగు సంవ‌త్స‌రాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేల కంటే వైసీపీ ఎమ్మెల్యేలే గుంటూరు ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే బాప‌ట్ల నియోజ‌కవ‌ర్గం. ఈ నియోజ‌కవ‌ర్గం నుంచి 2014 ఉఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున కోన ర‌ఘుప‌తి ఎమ్మెల్యే గా పోటీ చేసి త‌న ప్ర‌త్య‌ర్థి పై సుమారు 5813 పైచిలుకు ఓట్ల‌తో గెలిచారు. 
 
ఆ త‌ర్వాత నుంచి ఎమ్మెల్యే కోటకింద వ‌చ్చే నిధుల‌ను ఆశించ‌కుండా త‌న సొంత నిధుల‌తో వెచ్చించి అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేస్తూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్నఅవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుత‌న్నారు కోన‌ ర‌ఘుప‌తి. దీంతో ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త ప్ర‌భావం లేకుండా చేసుకున్నార‌నే చెప్పాలి.
 
అయితే అంత‌టితో ఆగ‌కుండా ప్ర‌జా క్షేమ‌మే త‌న క్షేమంగా భావించి పెండింగ్ లో ఉన్న అన్ని కార్య‌క్ర‌మాల‌ను చేయించారు. సూర్య‌లంక స‌ముద్రంలో ఉన్న అక్ర‌మాల‌ను తొల‌గించారు. అలాగే ప‌ట్టణంలో చ‌రిత్ర‌కు ప్ర‌సిద్దిగాంచిన క్షీరభావ‌న్నారామ‌ణ స్వామి దేవాల‌యం పున‌నిర్మాణ‌ ప‌నుల‌ను కూడా శ‌ర‌వేగంగా చేయిస్తున్నారు. ఇలా త‌న‌కు సాధ్యం అయినంత వ‌ర‌కూ బాప‌ట్ల నియోజ‌కవ‌ర్గంలో అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు కోన‌. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపుకు తిరుగులేద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.