ట్విట్ట‌ర్ నాయుడు ద‌మ్ముంటే అమ‌రావ‌తిలో చ‌ర్చ‌పెట్టు వైసీపీ ఎమ్మెల్యే స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

nara lokesh
Updated:  2018-06-18 04:28:42

ట్విట్ట‌ర్ నాయుడు ద‌మ్ముంటే అమ‌రావ‌తిలో చ‌ర్చ‌పెట్టు వైసీపీ ఎమ్మెల్యే స‌వాల్

2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా అవినీతి ప‌రిపాల‌న జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు రెడ్డి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు.సోమ‌వారం ఆయ‌న పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేశ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొద్దిరోజుల క్రితం లోకేశ్ ట్విట్ట‌ర్ ను వేదిక‌గా చేసుకుని రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజ‌కవ‌ర్గాల‌కు నిధులు ఇచ్చామ‌ని చెప్ప‌డం సిగ్గు చేటుగా ఉంద‌ని శ్రీనివాసులు మండిప‌డ్డారు.
 
లోకేశ్ ట్విట్ట‌ర్ లో చెప్పేది కాద‌ని ద‌మ్ముంటే అమ‌రావ‌తిలో చ‌ర్చ జ‌రిపి ఏ నియోజ‌కవ‌ర్గానికి ఎన్నినిధులు కేటాయించారో చెప్పాల‌ని స‌వాల్ విసిరారు. అంతేకాదు ఈ విష‌యంపై లోకేశ్ అమ‌రావ‌తిలో చ‌ర్చ ఏర్పాటు చేస్తే ఆ చ‌ర్చ‌లో తాను పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నాన‌ని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టీడీపీ సర్కార్ నిధుల‌ను ఇవ్వ‌కుండా ఎగ్గొట్టిందని శ్రీనివాసులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శింంచారు.
 
అంతేకాదు ఎమ్మెల్యేల సంబంధం లేకుండా అక్ర‌మంగా నిధుల‌ను దొడ్డిదారిన పంపిస్తున్నార‌ని, అందులో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌కుడా ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో దారుణాలు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఏదైన అనుకోని రీతిలో ప్ర‌మాదాలు జ‌రిగితే వారిని మాన‌వత్వంతో ఆసుప‌త్రికి తీసుకు వెళ్లాల్సిందిపోయి గాయ‌ప‌డిన వ్య‌క్త‌ల‌ను కూడా మీరు ఏ పార్టీకి చెందిన వారు అని అడ‌గ‌డం చాలా దారుణ‌మ‌ని అన్నారు.
 
అయితే ఇవ‌న్నిరాష్ట్ర‌ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి, ఆయ‌న ఎమ్మెల్యేల‌కు ప్ర‌జ‌లు గ‌తిన బుద్ది చెబుతార‌ని శ్రీనివాసులు అన్నారు.  చంద్రబాబు లాలూచీ రాజకీయాలు చేసి రాష్ట్రాన్నినాశ‌నం చేశార‌ని అన్నారు. అలాగే ఆయ‌న త‌న‌ వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు మండిప‌డ్డారు.

షేర్ :

Comments

5 Comment

  1. ! ! ?: http://electek.ru/news/27441-v-polshe-demontirovali-dva-sovetskih-tanka-t-34.html [b] -34 [/b] [url=http://electek.ru/news/18669-simvoly-v-sisteme-upravleniya-obschestvom.html] [/url] http://electek.ru/politika/18928-xiaomi-rasskazala-o-planah-sozdaniya-ubiycy-iphone

    ! ! ?: http://inosmip.ru/articles/3360-vozmozhno-li-otsutstvie-ameriki-na-blizhnem-vostoke-cherez-15-let-aksam-turciya.html [b] 15 ? ("Aksam", ) [/b] [url=http://inosmip.ru/news/23513-press-podhod-putina-i-abe-po-itogam-peregovorov.html] - [/url] http://inosmip.ru/news/1

    ! : http://agentorange.ru : http://agentorange.ru/art-foto-interesnoe/2829-natali-dormer-v-stylist-magazine.html [b] Stylist Magazine [/b] http://agentorange.ru/art-foto-interesnoe/4942-neveroyatnye-skulptury-iz-spichek.html [b] [/b] http://agentorange.ru/art-foto-interesnoe/

    There are different ways to fry tomatoes, but each of them will require the hostess to spend row hours in the kitchen, so this yavstvo is usually better correct do on weekends or for special occasions. When tomatoes are roasted, they get a deep taste and are combined with seafood, antipasto and oth

    ! ! : [b] [b] [/b] [url=http://www.ekolestnica.ru/]http://www.ekolestnica.ru/[/url] : https://www.ekolestnica.ru/mebelnyj-shhit-40-mm.html 18 : [url=https://www.ekolestnica.ru/balyasiny-ploskie.html] [/url] : https://www.ekolestnica.ru/mebelnyj-shhit-optom.html

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.