య‌న‌మ‌ల ముందు ఆ ప‌నిచెయ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-30 16:06:59

య‌న‌మ‌ల ముందు ఆ ప‌నిచెయ్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా వంచ‌న వ్య‌తిరేక దీక్ష సాక్షిగా మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.... 2014 ఎన్నిక‌ల్లో అధికారాన్ని ద‌క్కించుకున్న చంద్ర‌బాబు  ఒక్క‌సారి అయినా ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌స్తావించారా అని రోజా ప్ర‌శ్నించారు...
 
గ‌తంలో ఆయ‌న ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రానికి ఏం లాభం చేకూర‌దని, ప్ర‌త్యేక ప్యాకేజి వ‌ల్లే అభివృద్ది జ‌రుగుతుంద‌ని చెప్పిన చంద్రాబాబు... ఇప్పుడు రూటు మార్చి  ప్ర‌త్యేక హోదా కావాల‌ని అంటున్నార‌ని మండిప‌డ్డారు రోజా...చంద్ర‌బాబు రోజుకొక మాట మార్చుతూ ఊస‌రవెల్లి లాగా త‌యారు అవుతున్నార‌ని రోజా ఆరోపించారు.
 
కుట్ర రాజ‌కీయాలు చేయ‌డంలో చంద్ర‌బాబును మించిన నాయ‌కుడు లేర‌ని టీడీపీ-బీజేపీ వంచించి ఐదుకోట్ల ప్ర‌జ‌ల‌ను నిలువునా మోసం చేశారాని రోజా అన్నారు.. చంద్ర‌బాబు చేసే ప్ర‌తీ ప‌నిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, ఇక తాను హోదాపై పోరాడుతున్నాన‌ని తిరుప‌తిలో దీక్ష చేస్తే ఎవ్వ‌రు న‌మ్మ‌ర‌ని అన్నారు... విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశం పై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిరంత‌రంపోరాడుతూనే ఉన్నారని గుర్తు చేశారు రోజా... గ‌తంలో ఇదే చంద్ర‌బాబు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తే అక్ర‌మంగా వారిపై కేసులు పెట్టించార‌ని రోజా మండిప‌డ్డారు.
 
ఇక దీంతో పాటు టీడీపీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రోజా... ఆర్ధిక మంత్రి వ‌య‌సు పెరిగింది కానీ బుర్ర, బుద్ది మాత్రం పెరుగ‌లేద‌ని రోజా మండిప‌డ్డారు... జీఎస్టీ కౌన్సిల్ లో మెంబ‌ర్ అయ్యి ఉడి ఏపీకి నిధులు తీసుకురావ‌డం, రెవెన్యూ లోటు భ‌ర్తీ చేయ‌లేని యన‌మ‌ల జ‌గ‌న్ ను విమ‌ర్శించ‌డం మానుకోవాలి అని ఆయ‌న పై రోజా మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.