టీడీపీ ఎమ్మెల్యేల‌కు వైసీపీ ఎమ్మెల్యే స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-26 16:04:22

టీడీపీ ఎమ్మెల్యేల‌కు వైసీపీ ఎమ్మెల్యే స‌వాల్

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మను ఏర్పాటు చేయాలంటూ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. నిన్న రాజంపేట పార్ల‌మెంట్ ప‌రిధిలో దీక్ష‌ను విజ‌య‌వంతం చేసుకుని, ఈ రోజు జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఉక్కు సంక‌ల్ప‌యాత్ర దీక్ష‌ను చేప‌ట్టారు. 
 
ఈ దీక్ష‌లో పాల్గొన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ, గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంట్ నిర్మించ‌డానికి వీలుకాద‌ని చెప్పార‌ని, అయితే అప్పుడు వారితో మాత్రం వ్య‌వ‌హరించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి క‌డ‌ప ప్ర‌జ‌ల మీద ప్రేమ ఉంటే ఖ‌చ్చితంగా మోడీని ప్రాదేయ‌ప‌డి స్టీల్ ఫ్యాక్ట‌రీని స్థాపించి ఉండేవార‌ని అన్నారు.
 
ఇప్పుడు టీడీపీ నాయ‌కులు ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం దీక్ష‌లు చేసే బ‌దులు 2015లో కేంద్రంతో మిత్ర‌ప‌క్షానికి క‌టీఫ్ చెప్పి ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం నిరాహార దీక్ష‌లు చేసి ఉంటే ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యే అయిన తాము కూడా దీక్ష‌లు చేశామ‌ని రాచ‌మ‌ల్లు గుర్తు చేశారు. ఇవ‌న్నీ చేయ‌కుండా కేవ‌లం 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని రాచ‌మ‌ల్లు మండిప‌డ్డారు.
 
ఇప్పుడు ర‌మేష్ నాయుడు చేస్తున్న దీక్ష‌కు అమ‌రావ‌తి నుంచి వ‌చ్చి మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని విమ‌ర్శ‌లు చేశారు. అలాగే మంత్రి కాలువ శ్రీనివాసులుపై కూడా రాచ‌మల్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నాయ‌క‌లు కేవ‌లం తిన‌డానికే పుట్టామ‌ని మురికి కాలువ శ్రీనివాసులు అంటున్నార‌ని అన్నారు. అయితే తాము సాధార‌ణ మ‌నుషుల‌మ‌ని మాకు ఆక‌లి వేస్తుంద‌ని రాచ‌మ‌ల్లు అన్నారు. మ‌రి టీడీపీ నాయ‌కులు ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో కేవ‌లం నోట్ల క‌ట్ట‌ల‌ను తిని బ్ర‌తుకుతున్నార‌ని విమ‌ర్శ‌లు చేశారు. 
 
అలాగే త‌న‌పై కొద్ది రోజులుగా టీడీపీ నాయ‌కులు లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీడీపీ నాయ‌కులంద‌రూ క‌లిసి త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి రాచ‌మల్లు దొంగా అని ప్ర‌జ‌ల‌తో అనిపిస్తే  తాను టీడీపీ నాయ‌కుల కాళ్ల కింద దూరిపోతాన‌ని స‌వాల్ విసిరారు. త‌మ‌కు త‌మ‌నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి అవినీతి రాజ‌కీయాలు నేర్ప‌లేద‌ని నిజ‌మైన రాజ‌కీయాలు నేర్పించార‌ని, అందుకే తాము పోటీ చేసిన ప్ర‌తీ సారి ప్ర‌జ‌ల ప‌క్షాన‌ నిలుస్తున్నామ‌ని శిప్ర‌సాద్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.