బాబు స‌భ‌ల‌ను ఏర్పాటు చేసేది అందుకే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-09-04 05:46:43

బాబు స‌భ‌ల‌ను ఏర్పాటు చేసేది అందుకే

2014లో అధికారంలోకి వ‌చ్చిన ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు క‌డ‌ప జిల్లాపై చిన్న చూపు చూస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి మండిప‌డ్డారు ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, కేవ‌లం టీడీపీ ఎమ్మెల్యేల‌కు మాత్ర‌మే నియోజ‌క‌వ‌ర్గ నిధులు కేటాయిస్తున్నార‌ని వైసీపీ గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు చంద్ర‌బాబు నాయుడు నిధులు కేటాయించ‌లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
త‌మ జిల్లాలో ప్ర‌జ‌లు ఉన్నార‌ని, అత్య‌ధికంగా తాగు నీటి స‌మ‌స్య ఉంద‌ని, వ్య‌వ‌సాయానికి స‌మ‌స్య ఉంద‌ని నిరుద్యోగ స‌మ‌స్య‌లు ఉన్నాయి. వీట‌న్నింటిని స‌ర్కార్ ప‌ట్టించుకోకుండా ఉంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగున్న‌ర సంవ‌త్స‌రాలు అయింద‌ని, ఈ నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల్లో త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు టీడీపీ స‌ర్కార్ ఒక్క పైసా కూడా కేటాయించ‌లేద‌ని రాచ‌మ‌ల్లు మండిప‌డ్డారు. 
 
టీడీపీ అధికారంలో రూపాయి నాణెం కావాలంటే చంద్ర‌బాబు నాయుడుని పొగ‌డాల‌ని, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని ఎవ‌రైతే ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిట్టిపోస్తే వారికి నిధుల‌ను కేటాయిస్తాన‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ప్ర‌జా ధ‌నాన్ని విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేస్తూ వైసీపీ నాయ‌కులు దొంగ‌ల‌ని శుక్ర‌వారం జైలుకు వెళ్తార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అయ‌న మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.